Gold Price: గుడ్‏న్యూస్.. రాఖీనాడు తగ్గిన బంగారం ధరలు!

రాఖీ పౌర్ణమి రోజున పసిడి ప్రియులకు ఊరట కలిగింది. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు ఈరోజు పడిపోయాయి.

Gold Price: గుడ్‏న్యూస్.. రాఖీనాడు తగ్గిన బంగారం ధరలు!

Gold Rate

Gold Price: రాఖీ పౌర్ణమి రోజున పసిడి ప్రియులకు ఊరట కలిగింది. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు ఈరోజు పడిపోయాయి. బంగారం కొనుగోలు చేయాలని భావించేవారికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. రాఖీ పౌర్ణమి వేళ బంగారం ధరలు తగ్గుతుండడం.. అతివలకు ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. గత వారం కాస్త పెరిగిన బంగారం ధరలు… ఈ వారం కొద్దిగా తగ్గినా… మళ్లీ పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి.

ప్రధానంగా ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు మరింత పెరిగితే… ప్రపంచ దేశాల్లో అలజడి ఎక్కువవుతుంది. అందువల్ల ప్రపంచ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లి… వాటిలో సంపద బంగారంలోకి పెట్టుబడుల రూపంలో వస్తుంది. అదే జరిగితే బంగారం ధరలు పెరుగుతాయి. ప్రస్తుతానికి కొద్దిగా తగ్గాయి. నేడు దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,210కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్.. రూ.47,210కి చేరింది.

గత 10 రోజుల్లో 22 క్యారెట్ల నగల బంగారం రూ.1100 పెరిగి రూ.300 తగ్గింది. ఈ సంవత్సరం మార్చి 31న బంగారం ధరలు అతి తక్కువగా ఉండగా ఆ తర్వాత నుంచి కంటిన్యూగా పెగుదలే కనిపిస్తోంది. మార్చి 31 నుంచి ఇప్పటివరకూ నగల బంగారం ధర 10 గ్రాములు రూ.3,050 పెరిగింది. ఇలా చూసినా బంగారం ధరలు పెరుగుతున్నట్లే లెక్క. అయితే.. రోజువారీలో చూస్తే మాత్రం నేడు ధరలు తగ్గాయి.

హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,150 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.48,170కి చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.46,300 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రూ.50,500కి చేరింది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.46,210 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రూ.47,210కి చేరింది. అలాగే విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కూడా బంగారం ధరలలో మార్పులు జరిగాయి.