వాట్సాప్‌కు పోటీగా : గూగుల్ సొంత మెసేజస్ RCS యాప్ ఇదిగో

  • Published By: sreehari ,Published On : November 15, 2019 / 10:29 AM IST
వాట్సాప్‌కు పోటీగా : గూగుల్ సొంత మెసేజస్ RCS యాప్ ఇదిగో

ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ కు పోటీగా సెర్చ్ ఇంజిన్ దిగ్గజం సొంత మెసేంజర్ యాప్ ప్రవేశపెట్టింది. రిచ్ కమ్యూనికేషన్స్ సర్వీసెస్ (RCS) సొంత చాట్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ యూజర్లను తమవైపు ఆకర్షించేందుకు గూగుల్ ఈ కొత్త SMS టెక్స్ట్ మెసేజింగ్ సిస్టమ్ రూపొందించింది.

ప్రత్యేకించి ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాంపై యూజర్లు మరిన్ని చాట్ ఫీచర్లను అందించేందుకు RCS మెసేజెస్ యాప్ ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా వాట్సాప్ మాదిరిగానే యూజర్లు తమ స్నేహితులతో ఒకరినొకరు కొత్త చాట్ ఫీచర్లతో చాటింగ్ చేసుకోవచ్చు. 

Wi-Fi లేదా మొబైల్ డేటా ద్వారా చాట్ ఎనేబుల్ చేసుకోవచ్చు. తద్వారా హైరెజుల్యుషన్ ఫొటోలు, వీడియోలులను పంపడం లేదా పొందవచ్చు. లేటెస్ట్ మెసేజ్ లను కూడా చూడవచ్చు. గ్రూపు చాట్స్ చేసుకోవచ్చు. గ్రూపుల నుంచి యూజర్లను యాడ్ చేసుకోవచ్చు లేదా రిమూవ్ చేసుకోవచ్చు.

వాట్సాప్ మాదిరిగానే ఈ RCS చాట్ మెసేంజర్ కూడా సౌకర్యవంతంగా ఉంటుందని గూగుల్ తెలిపింది. RCS అనేది ఒక కమ్యూనికేషన్ ప్రొటోకాల్.. మొబైల్ టెలిఫోన్ వినియోగదారులు, ఫోన్ కు మధ్య SMS మెసేజ్ లను పంపుకోవచ్చు. ఈ ఏడాది ఆరంభంలో గూగుల్ యూకే, ఫ్రాన్స్ మెక్సికోలో ప్రతిఒక్కరికి ఈ RCS మెసేంజర్ యాప్ ఎనేబుల్ చేసింది. 

మెసేజ్ ల్లో ఈ చాట్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ యాప్ ద్వారా యూజర్లు Do more with messages అనే నోటిఫికేషన్ చూడవచ్చు. RCS చాట్ ఫీచర్లను ఎనేబుల్ చేసుకోవచ్చు. గూగుల్ మెసేజస్ లో కొన్ని చాట్ ఫీచర్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అమెరికాలో దశలవారీగా గూగుల్ ఎనేబుల్ చేస్తోంది.

ఒకవేళ మీ డివైజ్ లో కూడా గూగుల్ మెసేజెస్ అనే ఆప్షన్ ఉంటే.. రానున్న వారాల్లో మీకు కూడా చాట్ ఫీచర్లు ఎనేబుల్ చేసుకోనేందుకు నోటిఫై వస్తుంది. ఒకవేళ మెసేజెస్ యాప్ లేని పక్షంలో.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ సర్వీసు ముందుగా అమెరికాలో అందుబాటులోకి రానున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 

RCS చాట్ ఫీచర్ Enable చేయండిలా :
* ఆండ్రాయిడ్ ఫోన్లో Google Messages ఓపెన్ చేయండి.
* ఈ App లేకుంటే.. Play Store నుంచి Download చేయండి.
* కుడివైపు పైభాగంలో (…) మూడు డాట్లపై Tap చేయండి.
* సెట్టింగ్స్ బటన్ పై Tap చేయండి.
* Chat ఫీచర్లపై Tap చేయండి.
* ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి.
* Continue బటన్ పై tap చేయండి.