Google And Airtel : ఎయిర్ టెల్ పంట పండింది.. గూగుల్ భారీ పెట్టుబడులు

జియో కస్టమర్ల కోసం 4G స్మార్ట్‌ఫోన్‌ను కూడా డెవలప్‌ చేసింది. ఇప్పుడు ఎయిర్‌టెల్‌లోనూ గూగుల్‌ పెట్టుబడులు పెట్టడం ఆసక్తికరంగా మారింది...

Google And Airtel : ఎయిర్ టెల్ పంట పండింది.. గూగుల్ భారీ పెట్టుబడులు

Google And Airtel

Google To Invest : టెలికామ్‌ సర్వీస్ ప్రొవైడర్ భారతీ ఎయిర్‌టెల్‌ పంట పండింది. ప్రఖ్యాత సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ భారతీ ఎయిర్‌టెల్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయ్యింది. ఏకంగా వన్‌ బిలియన్‌ డాలర్లు.. అంటే భారత్‌ కరెన్సీలో అక్షరాల 7 వేల 400 కోట్ల రూపాయలను ఎయిర్‌టెల్‌లో ఇన్వెస్ట్ చేస్తోంది గూగుల్‌..! దీనికి సంబంధించి ఎయిర్‌టెల్‌ ప్రకటన కూడా చేసేసింది. వచ్చే ఐదేళ్లలో తమ సంస్థలో గూగుల్‌ 7 వేల 400 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. దీనిద్వారా ఎయిర్‌టెల్‌లో 1.28 శాతం వాటాను గూగుల్‌ దక్కించుకోనుంది. గూగుల్‌ భాగస్వామ్యంతో స్మార్ట్‌ ఫోన్స్‌, 5G సేవల విస్తరణ, ఇంటర్‌నెట్‌ యూసేజ్‌, క్లౌడ్‌ సిస్టమ్‌పై పనిచేయనుంది ఎయిర్‌టెల్‌.

Read More : Avanthi Srinivas : 26జిల్లాలు ఎలా వచ్చాయో, 3రాజధానులు అలాగే వస్తాయి-మంత్రి అవంతి

పెట్టుబడులకు సంబంధించిన వరకూ ఈ రెండు బిగ్ షాట్స్ మధ్య ఇప్పటికీ చాలా సార్లు పలు విడతల్లో చర్చలు జరిగాయి. ఏడాదిన్నరగా గూగుల్ మేనేజ్‌మెంట్ – భారతి ఎయిర్‌టెల్ మధ్య పెట్టుబడులకు సంబంధించిన డిస్కషన్స్ విస్తృతంగా సాగాయి. ఇప్పటికే ఎయిర్‌ టెల్ రైవల్‌ కంపెనీ ముఖేశ్‌ అంబానీకి చెందిన జియో ప్లాట్‌ఫామ్‌లో 33 వేల 737 కోట్ల పెట్టుబడులు పెట్టి 7.73 శాతం వాటాను దక్కించుకుంది గూగుల్‌. జియో కస్టమర్ల కోసం 4G స్మార్ట్‌ఫోన్‌ను కూడా డెవలప్‌ చేసింది. ఇప్పుడు ఎయిర్‌టెల్‌లోనూ గూగుల్‌ పెట్టుబడులు పెట్టడం ఆసక్తికరంగా మారింది.