నిజమే : 9వేల కిలోల బంగారాన్ని అమ్మేశారు

భారత ప్రభుత్వం 9వేల కిలోల బంగారాన్ని అమ్మేసింది. మార్కెట్లో గోల్డ్ కి ఉన్న డిమాండ్ తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఈ పని చేసింది.

  • Published By: veegamteam ,Published On : April 10, 2019 / 01:36 AM IST
నిజమే : 9వేల కిలోల బంగారాన్ని అమ్మేశారు

భారత ప్రభుత్వం 9వేల కిలోల బంగారాన్ని అమ్మేసింది. మార్కెట్లో గోల్డ్ కి ఉన్న డిమాండ్ తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఈ పని చేసింది.

భారత ప్రభుత్వం 9వేల కిలోల బంగారాన్ని అమ్మేసింది. మార్కెట్లో గోల్డ్ కి ఉన్న డిమాండ్ తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఈ పని చేసింది. అలా అమ్మడం ద్వారా వచ్చిన నగదును దేశీయ ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశపెట్టింది.  ఈ విషయాన్ని ఆర్థిక శాఖకు చెందిన కొందరు అధికారులు ధృవీకరించారు. గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీంలో భాగంగా ప్రభుత్వం మధ్యకాల, దీర్ఘకాల డిపాజిట్ల కింద సేకరించిన బంగరాన్ని విక్రయించాలని నిర్ణయించింది.
Read Also : ఎన్నికల్లో..మద్యం,మనీల వరద: రూ.528.98 కోట్లు సీజ్

ప్రభుత్వం గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీం కింద ఫిబ్రవరి 20నాటికి 15వేల 650 కిలోల బంగారాన్ని సేకరించింది. ఇందులో 6వేల 584 కిలోల బంగారం స్వల్పశ్రేణి బాండ్ల కింద… 2వేల 938 కిలోల బంగారం మధ్యశ్రేణి కింద..  6వేల 128 కిలోల బంగారం దీర్ఘశ్రేణి బాండ్ల కింద సమీకరించింది. ఈ స్కీం కింద ప్రభుత్వం 2.5 శాతం వడ్డీ రేటును చెల్లించడంతో పాటు చివర్లో బంగారం మొత్తానికి సమానమైన నగదును ఇస్తుంది.

ప్రజల దగ్గర  నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని వ్యవస్థలోకి తెచ్చేందుకు ఈ స్కీంను ప్రభుత్వం 2015లో ప్రవేశపెట్టింది. ఈ స్కీం కింద 1-3ఏళ్ల వ్యవధిని స్వల్పకాలికంగా, 5-7ఏళ్ల వ్యవధిని మధ్యకాలికంగా, 12-15ఏళ్ల వ్యవధిని  దీర్ఘకాలికంగా పరిగణిస్తారు. ఇందులో భాగంగా మధ్య, దీర్ఘశ్రేణి డిపాజిట్ల కింద సేకరించిన బంగారాన్ని విక్రయించారు.
Read Also : లక్ష్మీస్ NTR సినిమాను చూడనున్న న్యాయమూర్తులు