రూల్స్ పాటించాల్సిందే : అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు ప్రభుత్వం అలర్ట్

  • Published By: sreehari ,Published On : November 12, 2019 / 01:45 PM IST
రూల్స్ పాటించాల్సిందే : అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు ప్రభుత్వం అలర్ట్

వచ్చే ఏడాది నుంచి కొత్త ఈ-కామర్స్ పాలసీ రాబోతోంది. దీనికి సంబంధించి ప్రతిపాదనలపై కూడా కసరత్తు జరుగుతోంది. ఈ తరుణంలో ప్రభుత్వం .. ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు ఇండియాలోని వ్యాపారానికి సంబంధించి మరోసారి మార్గదర్శకాలను సూచిస్తోంది. డ్రాఫ్ట్ కంజ్యూమర్ ప్రొటెక్షన్ (ఈ-కామర్స్) రూల్స్ 2019 ప్రకారం.. వినియోగదారుల వ్యవహారాల శాఖ అలర్ట్ జారీ చేసింది. 

ఈ కామర్స్ వెబ్ సైట్లలో విక్రయించే ప్రొడక్టుల ధరలపై ప్రత్యక్షంగా గానీ లేదా పరోక్షంగా గానీ తప్పుడు సమీక్షలతో పేరుతో వినియోగదారులను లావాదేవీలపై నిర్ణయం తీసుకునేలా ప్రభావితం చేయరాదని స్పష్టం చేసింది. ఈకామర్స్ కంపెనీలు.. రిటర్న్స్, రీఫండ్స్, ఎక్సంజ్, డెలివరీ, పేమెంట్స్ తో పాటు తమ విక్రయదారుల మధ్య ఒప్పంద కాలపరిమితిని బహిర్గతం చేయాలని సూచించింది.

ఈ విషయంలో పరిశ్రమ వాటాదారుల నుంచి డిసెంబర్ 2, 2019 లోగా స్పందన తెలియజేయాలని వినియోగదారుల శాఖ కోరింది. 2019 ఆగస్టులోనే ఈ శాఖకు సంబంధించి డ్రాఫ్ట్ ఈ-కామర్స్ పాలసీని తీసుకుచ్చే అంశంపై ఈకామర్స్ కంపెనీలకు మార్గదర్శకాలను జారీ చేసింది.