రియల్ ఎస్టేట్‌కు బిగ్ రిలీఫ్ : ట్యాక్స్ రేట్లపై డెవలపర్లదే చాయిస్

రియల్ ఎస్టేట్ రంగంలోని డెవలపర్లకు బిగ్ రిలీఫ్. రియల్ ఎస్టేట్ సెక్టార్ పై లోయర్ ట్యాక్స్ రేట్లను జీఎస్టీ కౌన్సిల్ క్లీయర్ చేసింది. నిర్మాణంలో ఉన్న ఆస్తులపై డెవలపర్లు తమ సొంత ట్యాక్స్ రేటును ఎన్నుకోనే అవకాశం కల్పించింది.

  • Published By: sreehari ,Published On : March 19, 2019 / 11:58 AM IST
రియల్ ఎస్టేట్‌కు బిగ్ రిలీఫ్ : ట్యాక్స్ రేట్లపై డెవలపర్లదే చాయిస్

రియల్ ఎస్టేట్ రంగంలోని డెవలపర్లకు బిగ్ రిలీఫ్. రియల్ ఎస్టేట్ సెక్టార్ పై లోయర్ ట్యాక్స్ రేట్లను జీఎస్టీ కౌన్సిల్ క్లీయర్ చేసింది. నిర్మాణంలో ఉన్న ఆస్తులపై డెవలపర్లు తమ సొంత ట్యాక్స్ రేటును ఎన్నుకోనే అవకాశం కల్పించింది.

రియల్ ఎస్టేట్ రంగంలోని డెవలపర్లకు బిగ్ రిలీఫ్. రియల్ ఎస్టేట్ సెక్టార్ పై లోయర్ ట్యాక్స్ రేట్లను జీఎస్టీ కౌన్సిల్ క్లీయర్ చేసింది. నిర్మాణంలో ఉన్న ఆస్తులపై డెవలపర్లు తమ సొంత ట్యాక్స్ రేటును ఎన్నుకోనే అవకాశం కల్పించింది. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంతో రియల్ ఎస్టేట్ డెవలపర్లకు భారీ ఊరట కలుగనుంది. మంగళవారం (మార్చి 19, 2019) 34వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. రియల్ ఎస్టేట్ రంగంలోని లోయర్ GST రేట్లు, ట్రాన్సిషన్ ప్లాన్ అమలకు సంబంధించిన సమస్యలపై సమావేశంలో చర్చించిన కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో డెవలపర్లు నిర్మాణంలో ఉన్న తమ ప్రాజెక్టులపై ట్యాక్స్ రేటు 12 శాతం మధ్య ఎంపిక చేసుకోవచ్చు.
Read Also : అందంగా కన్పించేందుకు : మాయా రోజూ ఫేసియల్ చేయించుకుంటది

ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఫెసిలిటీ లేదా 5 శాతం లేకుండా ఎంచుకునే అవకాశం ఉంది. హౌజింగ్ ప్రాజెక్టుల విషయంలో 8 శాతం మధ్య ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్, 1 శాతం లేకుండా ఎంపిక చేసుకోవచ్చు. ఈ కొత్త విధానం ఏప్రిల్ 1, 2019 నుంచి అమల్లోకి రానున్నట్టు రెవిన్యూ సెక్రటరీ ఏబీ పాండే తెలిపారు. ఈ స్కీమ్ కింద.. అండర్ కన్ స్ట్రక్షన్ లో ఉన్న ఒక ప్రాజెక్ట్ కు మాత్రమే ఆమోదం లభించనుంది. ప్రత్యేకించి ట్రాన్సిషన్ సమస్యల నుంచి రియల్ సెక్టార్ డెవలపర్లను గట్టు ఎక్కేంచేందుకు ఈ స్కీమ్ ఉపయోగపడుతుందని ట్యాక్స్ పార్టనర్ ఈవై ఇండియా అభిషేక్ జైన్ చెప్పారు. గతంలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్మాణంలో ఉన్న రియల్ ప్రాజెక్టులపై 5 శాతం ట్యాక్స్ రేట్లను తగ్గించింది. 

హోం ప్రాజెక్టులపై 1 శాతం వరకు ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ ను తొలగించింది. జీఎస్టీ తాజా నిర్ణయంతో ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా బయర్లు తమ బడ్జెట్ కు తగిన హౌసింగ్ రేట్లనే పొందే అవకాశం ఉందని రియాల్టీ మేనేజింగ్ డైరెక్టర్ పార్థ్ మెహతా తెలిపారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంతో ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ ను నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ప్రయోజనం చేకూరనుంది.

ఫైనాస్స్ మినిస్టరీ డేటా ప్రకారం.. ఫిబ్రవరిలో రియల్ ఎస్టేట్ సెక్టార్ నుంచి వసూల్ చేసిన జీఎస్టీ రూ.1.02 లక్షల కోట్లు నంచి రూ.97వేల 247 కోట్లు వరకు పడిపోయింది. ఫిబ్రవరి 2019లో జీఎస్టీ రెవిన్యూ మొత్తం రూ.97వేల 247 కోట్లు కాగా.. సెంట్రల్ జీఎస్టీ రూ.17వేల 626 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ (SGST) రూ.24వేల 192 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST) రూ.46వేల 953గా రికార్డు అయినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 
Read Also : సమ్మర్ ఎఫెక్ట్ : ఏపీలో సాయంత్రం 6 వరకు పోలింగ్