జాగ్రత్తగా ఉండండి : అంగట్లో మీ బ్యాంకు కార్డు డేటా 

  • Published By: madhu ,Published On : February 7, 2020 / 01:32 PM IST
జాగ్రత్తగా ఉండండి : అంగట్లో మీ బ్యాంకు కార్డు డేటా 

అవును మీరు వింటున్నది నిజమే. మీ బ్యాంకు కార్డు డేటా మొత్తం మార్కెట్‌లో లభ్యమౌతోంది. అరే ఇదెలా సాధ్యం. తాము ఎంతో జాగ్రత్తగా ఉన్నామే..ఏటీఎంలో కూడా ఎంతో సెక్యూర్టీగా ఉంటూ..డబ్బులు డ్రా చేసుకుంటున్నాం..అంటారు కదా..కానీ హ్యాకర్స్ ఊరుకుంటారా..కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తూ..డేటాను చోరీ చేసేస్తున్నారు. మీరు ఏమి చెప్పకుండానే..బ్యాంకు అకౌంట్లలో నుంచి డబ్బు డ్రా చేసేస్తున్నారు.

తాజాగా 4 లక్షల 61 వేల 976 కార్డుల డాటే డార్క్ వెబ్‌లో నిక్షిప్తం అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. సింగపూర్‌కు చెందిన గ్రూప్ ఐబి భద్రతా పరిశోధన బృందం డార్క్ వెబ్‌లో క్రెడిట్, డెబిట్ కార్డు వివరాల డేటా బేస్ కనుగొన్నారు. పేమెంట్ కార్డు వివరాలను 2020, ఫిబ్రవరి 05వ తేదీ వరకు ఉన్నాయి. మొత్తం అకౌంట్‌లలో 98 శాతం భారీతీయ బ్యాంకులకు చెందినవి కాగా..మిగిలినవి ఇతర వాటికి చెందినవిగా గుర్తించారు. 

గ్రూప్ ఐబీ అంచనా ప్రకారం డేటా బేస్ యొక్క మొత్తం అంచనా విలువ USD 4.2 మిలియన్లు. 2020, ఫిబ్రవరి 06వ తేదీ వరకు 16 కార్డు వివరాలు అమ్ముడైనట్లు గుర్తించారు. మోసానికి పాల్పడే ఉద్దేశ్యంతో కార్డులను కొనుక్కొని ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భారతదేశానికి చెందిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) అప్రమత్తం చేశారు. 

1.3 మిలియన్ క్రెడిట్, డెబిట్ కార్డు రికార్డులు అప్ లోడ్ చేయబడ్డాయని, మార్కెట్ విలువ 130 మిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. భారతదేశంలో నగదు రహిత లావాదేవీలకు ప్రజలు అట్రాక్షన్ అవుతున్నారు. కానీ ఆన్ లైన్, ఆఫ్ లైన్ చెల్లింపుల్లో సరియైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది మోసపోతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

* ATM కీ ప్యాడ్‌లలో కీ స్ట్రోక్ ట్రాకర్ లేదా ఓ చిన్న కెమెరాను ఉంచుతాడు.
* క్రెడిట్ / డెబిట్ కార్డును ఏటీఎంలో పెట్టిన అనంతరం అది కార్డు వెనుక భాగంలో ఉన్న అయస్కాంత లైన్‌లో ఉన్న సమాచారం మొత్తం సేకరిస్తుంది. 
* ఇక నాలుగు అంకెల్ పిన్ నెంబర్ కూడా ఇతర డివైస్‌లో రికార్డు చేసేస్తుంది. 

* అనంతరం కార్డు దారుడు వెళ్లిపోయిన తర్వాత..ఉన్న సమాచారంతో నకిలీ కార్డును తయారు చేస్తాడు. 
* సరుకులను కొనడం లేదా డబ్బులు డ్రా చేయడం స్టార్ట్ చేస్తాడు. 
సో..జాగ్రత్తగా ఉండడం బెటర్.