Hallmark: పాత గోల్డ్‌కు కొత్త హాల్ మార్క్

బంగారంలో స్వచ్ఛత ప్రమాణాల కోసం తీసుకొచ్చిన విధానమే హాల్‌మార్కింగ్‌. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌(బీఐఎస్‌) ప్రకారం.. 22 క్యారెట్ల బంగారం పేరుతో నగలు కొంటున్నప్పుడు అందులో ప్యూరిటీ ఉందా?.. లేదా?.. అని తెలుసుకోవడమే హాల్‌మార్కింగ్‌ ఉద్దేశం.

Hallmark: పాత గోల్డ్‌కు కొత్త హాల్ మార్క్

Gold Price (1)

Hallmark: బంగారంలో స్వచ్ఛత ప్రమాణాల కోసం తీసుకొచ్చిన విధానమే హాల్‌మార్కింగ్‌. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌(బీఐఎస్‌) ప్రకారం.. 22 క్యారెట్ల బంగారం పేరుతో నగలు కొంటున్నప్పుడు అందులో ప్యూరిటీ ఉందా?.. లేదా?.. అని తెలుసుకోవడమే హాల్‌మార్కింగ్‌ ఉద్దేశం.

ఈ కారణంగా బంగారం వ్యాపారులపై బీఐఎస్‌.. అనేక నిబంధనలను విధించింది. ప్రతీ నగపై ఖచ్చితమైన గుర్తు, దానికి ప్రత్యేక నెంబర్‌ ఉండాలని సూచించారు. దీన్నే హాల్‌మార్కింగ్‌ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ (HUI) నెంబర్‌ అంటారు. దీని ఆధారంగా అమ్మిన వారి వివరాలు, అందులో ప్యూరిటీ ఎంత ఉందనేది BIS Care App ద్వారా తెలుసుకోగలం.

కొత్త నగలకు ప్యూరిటీ చెప్తున్నారు సరే. పాత నగల క్వాలిటీ సంగతేంటి. దీనికి కూడా పరిష్కారం ఉంది. పాత బంగారు నగలకు కూడా హాల్‌మార్కింగ్‌ చేయించుకునే సౌలభ్యం కల్పిస్తోంది బీఐఎస్‌. ఇందుకోసం మనం బీఐఎస్‌ అధీకృత జ్యుయెల్లర్‌ లేదా సెంటర్‌ వద్దకు వెళ్లాలి. వాళ్లు మన నగలను దగ్గరిలోని సెంటర్‌కు పంపిస్తారు. అందులో ఎంత ప్యూరిటీ ఉందో తెలుసుకున్న తర్వాత దానిపై హాల్‌మార్క్‌తోపాటు సర్టిఫికెట్‌ కూడా అందజేస్తారు.

Read Also: మహిళలకు గుడ్‌న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర!

హాల్‌మార్కింగ్‌ ఛార్జీలు ఎంత?
హాల్‌మార్కింగ్‌ కావాలంటే బంగారం ఆభరణానికి రూ.35 చొప్పున వెండి నగలకు రూ.25 లెక్కన వసూలు చేస్తారు. గోల్డ్‌ టెస్టింగ్‌ కోసం నాలుగు ఆర్టికల్స్‌ కలిగిన ఒక్కో కన్సైన్‌మెంట్‌కు రూ.200 తీసుకుంటారు. సర్టిఫికెట్‌ జారీ మాత్రం ఉచితం.

సదరు నగ బరువు ఎంత?
ఎక్స్‌రే ఫ్లోరోసెన్స్‌ పద్ధతి, శాంప్లింగ్‌, పైర్‌ అస్సే, లేజర్‌ మేకింగ్‌ వంటి ఫ్లోచార్ట్‌ ప్రక్రియ అంతా బీఐఎస్‌ నిబంధనల ప్రకారమే జరుగుతుంది. అలా ప్రక్రియనంతా ఫ్లోచార్ట్‌ ప్రకారం ఫాలో అవుతూ ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. టెస్టింగ్‌ తర్వాత ఈ ఆభరణాలకు 6అంకెల ఆల్ఫా న్యూమరిక్‌ కోడ్‌ను అందిస్తుంది బీఐఎస్‌ సంస్థ. దానిపై బీఐఎస్‌ లోగో, ప్యూరిటీ మార్క్‌ వేస్తారు.

ఎంత ప్యూరిటీకి ఏ మార్క్‌?
22 క్యారెట్‌ బంగారానికి 916, 18 క్యారెట్‌కు 750, 14 క్యారెట్‌కు 585 ప్యూరిటీ సర్టిఫికెట్‌ లభిస్తుంది.