హార్లే-డేవిడ్ సన్ కీలక నిర్ణయం…ఈ బైక్ ల ఉత్పత్తి నిలిపివేత

  • Published By: venkaiahnaidu ,Published On : October 16, 2019 / 03:04 PM IST
హార్లే-డేవిడ్ సన్ కీలక నిర్ణయం…ఈ బైక్ ల ఉత్పత్తి నిలిపివేత

అమెరికాకు చెందిన ప్రముఖ మోటారుసైకిల్ సంస్థ హార్లే-డేవిడ్సన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ మోటా ర్‌బైక్‌ల ఉత్పత్తిని నిలిపివేసింది. బైక్ ఛార్జింగ్ వ్యవస్థలో సమస్యను గుర్తించిన తర్వాత ఈ చర్య తీసుకొంది.

ఈ సంస్థ తొలిసారిగా తీసుకొచ్చిన ఈ విద్యుత్ బైక్ పేరు ‘లైవ్‌వైర్’. 105 హార్స్‌పవర్ సామర్థ్యమున్న ఈ బైక్ ఖరీదు దాదాపు 26.28 లక్షల రూపాయలు. హార్లే-డేవిడ్సన్ గత నెలలో అమెరికాలోని డీలర్లకు బైక్‌ల సరఫరాను మొదలుపెట్టింది. ఇప్పటికే సరఫరా చేసిన బైక్‌లు సురక్షితమైనవేనని సంస్థ స్పష్టం చేసింది.

అయితే వీటిని ఇళ్లలో, తక్కువ వోల్టేజ్ ఔట్‌లెట్లతో కాకుండా తప్పనిసరిగా డీలర్‌షిప్‌ కేంద్రాల దగ్గర ఛార్జ్ చేయాలని చెప్పింది. బైక్ ఛార్జింగ్‌కు గంట పడుతుంది. ఒకసారి చార్జ్ చేస్తే తక్కువ వేగంతోనైతే 235 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. ఛార్జింగ్ వ్యవస్థలో సమస్య సాధారణంగా రాదని హార్లే-డేవిడ్సన్ సోమవారం చెప్పింది. ఉత్పత్తి తిరిగి ఎప్పుడు మొదలవుతుందో కంపెనీ తెలుపలేదు.