సంక్షోభంలోనూ ఉద్యోగులకు బోనస్, జీతాలు ఇస్తున్న కంపెనీ

  • Published By: madhu ,Published On : May 21, 2020 / 09:15 AM IST
సంక్షోభంలోనూ ఉద్యోగులకు బోనస్, జీతాలు ఇస్తున్న కంపెనీ

తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు పూర్తి స్థాయి వేతనాలతో పాటు..గత సంవత్సరం ఇచ్చిన హామీకి కట్టుబడి బోనస్ లు కూడా ఇస్తామని దేశంలోనే అతిపెద్ద సాఫ్ట్ వేర్ సర్వీస్ కంపెనీగా పేరొందిన HCL టెక్నాలజీస్ ప్రకటించింది. 15 వేల మంది కొత్త వారికి ఇచ్చిన ఆఫర్ లెటర్లను గౌరవిస్తామని, వారందరినీ ఉద్యోగాల్లోకి తీసుకుంటామని వెల్లడించింది. ఈ సంస్థలో లక్షా 50 వేల మంది పనిచేస్తున్నారని అంచనా.

గత 12 నెలల్లో ఉద్యోగులు ప్రదర్శించిన పనితీరు ఆధారంగా బోనస్‌లు ఇస్తామని HCL టెక్నాలజీ మానవ వనరుల ముఖ్య అధికారి వీవీ అప్పారావు తెలిపారు. కరోనా కారణంగా..తయారీ, రవాణా వంటి అంశాల్లో వత్తిడిని ఎదుర్కొంటున్నామని, నిర్వహిస్తున్న కొత్త ప్రాజెక్టులతో పాటు..కొత్త ప్రాజెక్టులు ఆలస్యం కావచ్చనే అభిప్రాయం వెలిబుచ్చారు. ప్రస్తుతం తమవద్దనున్న ప్రాజెక్టులు ఎవీ రద్దు కాలేదని, దాదాపు ఐదు వేల మంది సిబ్బంది అవసరం ఉన్నదని..ఇందుకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతోందన్నారు.

2008 సంవత్సరంలో వచ్చిన సంక్షోభం..ఆ తర్వాత..ఉద్యోగుల జీతాల జోలికి వెళ్లలేదన్నారు. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ కారణంగా..గత నెలలో ఉద్యోగుల ఉత్పాతదకత 16 నుంచి 17 శాతం పెరిగిందని, భవిష్యత్ లో 50 శాతం మంది ఉద్యోగులను ఇంటి వద్దనుంచే పని చేసే విధంగా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. ఇక మరోవైపు ఐటీ సెక్టార్ లో దిగ్గజాలైన ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ తో పాటు కొన్ని కంపెనీలు ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడంలో ఆలస్యం చేయడంతో పాటు..ప్రమోషన్స్, ఇతర వాటిని తాత్కాలికంగా నిలిపివేశాయి.

కంపెనీలపై పడుతున్న భారాన్ని తగ్గించుకొనేందుకు కంపెనీలు పలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కరోనా విశ్వరూపం దాల్చడంతో సడలింపులతోనైనా ఆర్థికంగా ఊరట దక్కేట్లు కన్పించడం లేదని ఈ సంస్థలు భావిస్తున్నాయి. అందుకే వీలైనంతగా ఖర్చులు తగ్గించుకుంటూ ఉద్యోగాలకు ఉద్వాసన పలుకుతున్నాయి. 

Read:  రోడ్డున పడుతున్నారు : Ola Cabs బ్యాడ్ న్యూస్