తొలి బ్యాంకు ఇదే : M-Capలో రూ.7లక్షల కోట్లకు చేరిన HDFC

  • Published By: sreehari ,Published On : November 15, 2019 / 12:20 PM IST
తొలి బ్యాంకు ఇదే : M-Capలో రూ.7లక్షల కోట్లకు చేరిన HDFC

దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ రుణదాత HDFC బ్యాంక్ రూ .7 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) లీగ్‌లో చేరింది. ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తర్వాత మూడవ భారతీయ కంపెనీగా ఈ బ్యాంకు నిలిచింది. అంతేకాదు.. ఈ ఘనతను సాధించిన మొదటి బ్యాంకు కూడా HDFCనే కావడం విశేషం.

HDFC బ్యాంక్ మూలధన మార్కెట్ ఎన్నడూ లేనంతగా తొలిసారి రూ 7.01 లక్షల కోట్లను తాకింది. ప్రైవేటు రంగ రుణదాతల షేర్లు గురువారం (నవంబర్ 14, 2019) 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL), TCS మాత్రమే ఈ మైలురాయిని సాధించాయి. రూ .9.38 లక్షల కోట్ల మార్కెట్ మూలధనంతో, RIL అత్యధిక విలువైన సంస్థగా నిలవగా, తరువాతి స్థానంలో రూ .8.28 లక్షల కోట్లతో TCS నిలిచింది.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,285 వద్ద 0.7 శాతం పెరిగి బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో ఒక్కొక్కటి రూ.1283.40 వద్ద ట్రేడవుతున్నాయి. అంతకుముందు ముగింపు స్థాయి రూ.1,273.70 తో పోలిస్తే బ్యాంక్ స్టాక్ రూ.1,283 వద్ద ప్రారంభమైంది. ఈ ఏడాది సెప్టెంబర్ 23న ఈ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,285 ను తాకగా, నవంబర్ 15, 2018న 52 వారాల కనిష్టంగా రూ.979.23లకు చేరుకుంది.

ఇదే తరహా ట్రెండ్‌లో.. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌పై HDFC బ్యాంకు షేర్లు రూ.1,281.75 వద్ద 0.62 శాతంగా పెరిగాయి. ఎక్సేంజ్ లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. BSEపై రెండు వారాల సగటు వాల్యూమ్ 2.04లక్షల షేర్లతో పోలిస్తే 1.53లక్షల షేర్లు చేతులు మారాయి.

సెప్టెంబర్ త్రైమాసికంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నికర లాభం 26.8 శాతం పెరిగి రూ. 6,345 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే రూ .5,005.73 కోట్లుగా ఉంది. రుణదాత నికర వడ్డీ ఆదాయం 14.89 శాతం పెరిగి రూ.13,515 కోట్లకు చేరుకుంది.

ఇతర ఆదాయం రూ. 5,588.7 కోట్లుగా నమోదైంది. ఇది వార్షిక ప్రాతిపదికన 39.2 శాతం మేర పెరిగింది. మరోవైపు బీఎస్ఈ సెన్సెక్స్ 213.96 పాయింట్లు లేదా 0.53 శాతం పెరిగి 40,500 వద్ద ట్రేడ్ అవుతోంది. NSE నిఫ్టీ కూడా 0.5శాతం పెరిగి 11,931.3 వద్ద స్థిరపడింది.