HDFC: గృహ రుణాలు తీసుకునేవారికి హెచ్‌డీఎఫ్‌సీ బంపర్ ఆఫర్

హౌసింగ్ ఫైనాన్స్‌లో బెస్ట్‌గా కనిపిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు గృహ రుణాలకు సంబంధించి రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

HDFC: గృహ రుణాలు తీసుకునేవారికి హెచ్‌డీఎఫ్‌సీ బంపర్ ఆఫర్

HDFC: హౌసింగ్ ఫైనాన్స్‌లో బెస్ట్‌గా కనిపిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు గృహ రుణాలకు సంబంధించి రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పండుగ సీజన్(పండుగ బొనాంజా ఆఫర్) దృష్ట్యా, గృహ రుణ రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది హెచ్‌డీఎఫ్‌సీ. గృహ రుణం సెప్టెంబర్ 20వ తేదీ నుంచి తక్కువ రేటులో ఇవ్వబడుతుంది. HDFC వినియోగదారులకు 6.70 శాతం చొప్పున గృహ రుణాలను అందించాలని నిర్ణయించింది బ్యాంకు. ఈ పథకం అక్టోబర్ 31వ తేదీ వరకు కొనసాగుతుంది.

ఈ పథకం కొత్త రుణ దరఖాస్తుదారులు అందరికీ వర్తిస్తుంది. రుణం తీసుకునే వ్యక్తి వర్గం మరియు రుణం మొత్తం పథకంపై ప్రభావం చూపదు. హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్‌డీఎఫ్‌సీ) పండుగ ఆఫర్లలో భాగంగా సెప్టెంబర్ 21 నుంచి 6.70 శాతానికి గృహ రుణాలను అందించనున్నట్లు వెల్లడించిన బ్యాంకు క్రెడిట్‌ స్కోర్‌ మాత్రం 800కి పైగా ఉండాలని షరతు విధించింది. హెచ్‌డిఎఫ్‌సి ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. దీని కింద, కస్టమర్లు 6.70శాతం చొప్పున గృహరుణం తీసుకోవచ్చని, ఈ సౌకర్యం సెప్టెంబర్ 20 నుండి వర్తిస్తుంది.

ఈ పథకం రుణ దరఖాస్తులకు వర్తిస్తుంది. గృహ రుణం నిర్దిష్ట రేటు రుణదాత క్రెడిట్ స్కోరుపై ఆధారపడి ఉంటుంది. ఇది 31 అక్టోబర్ 2021 వరకు అమలులో ఉండే క్లోజ్ ఎండెడ్ స్కీమ్.

HDFC ఏమి చెప్పింది?
హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రేణు సూద్ కర్నాడ్ ఈ పథకం గురించి మాట్లాడుతూ, “దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆస్తి ధరలు ఒకే విధంగా ఉన్నాయి. నేడు గృహరంగం మునుపటి కంటే సరసమైనదిగా కనిపిస్తుంది. గత రెండేళ్లలో ప్రజల ఆదాయ పెరిగింది. ఆస్తి ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. దీనిలో PMAYలో వడ్డీ రేటు, సబ్సిడీ మరియు పన్ను ప్రయోజనాలలో రికార్డుస్థాయిలో పతనం కావడం కస్టమర్లకు మరింత సహాయపడుతుంది.

మరోవైపు, హెచ్‌డిఎఫ్‌సీ అనుబంధ సంస్థ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిటైల్ రుణాన్ని రెట్టింపు చేయడానికి ఖాతాదారుల నుంచి డిమాండ్ పెరుగుతూనే ఉంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రిటైల్ అసెట్ హెడ్ అరవింద్ కపిల్ మాట్లాడుతూ, ఇప్పుడు కరోనా తర్వాత పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయని, వ్యాపారం మెరుగుపడుతున్న కొద్దీ వృద్ధిరేటు పుంజుకుని ఆర్థికంగా పుష్టిగా తయారవుతున్నారని, ఈ సమయంలో వారికి వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల ఇళ్లు కట్టుకునేందుకు సాయంగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు.

మిగిలిన బ్యాంకులు కూడా రేటును తగ్గించాయి: 
స్టేట్ బ్యాంక్ కూడా ఇటీవలికాలంలో హోం రుణాలపై వడ్డీలను తగ్గించాయి. స్టేట్ బ్యాంక్ అడుగుజాడల్లోనే అనుసరించి గృహ రుణ రేటును తగ్గించాలని HDFC నిర్ణయించింది. స్టేట్ బ్యాంక్ ఫెస్టివ్ బొనాంజా ఆఫర్ కింద 6.70 శాతం చొప్పున గృహ రుణాన్ని అందిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు ప్రైవేట్ బ్యాంక్ కోటక్ మహీంద్రా కూడా గృహ రుణ రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ క్రమంలోనే హెచ్‌డిఎఫ్‌సి 6.7 శాతం చొప్పున గృహ రుణం ఇస్తున్నట్లు ప్రకటించింది.

రుణం కోసం పరిస్థితి ఏమిటి?
అయితే, రుణం తీసుకోవడానికి ముఖ్యంగా క్రెడిట్ స్కోరు 800 కంటే ఎక్కువ ఉండాలి. ఈ రుణ పథకం ప్రారంభానికి ముందు, 75 లక్షల కంటే ఎక్కువ రుణాలపై జీతం తీసుకునే వినియోగదారులకు 7.15% వడ్డీ రేటు మరియు క్రెడిట్ స్కోరు 800 ఉంది. స్వయం ఉపాధి వ్యక్తుల కోసం వడ్డీ రేటు 7.30 గా నిర్ణయించబడింది. ఈ పథకం అక్టోబర్ 31వ తేదీ వరకు కొనసాగుతుంది.