దేశంలో అమ్మే తేనే బ్రాండ్లు 77 శాతం కల్తీవే : సీఎస్ఈ

  • Published By: murthy ,Published On : December 2, 2020 / 10:04 PM IST
దేశంలో అమ్మే తేనే బ్రాండ్లు 77 శాతం కల్తీవే : సీఎస్ఈ

Honey sold by major brands in India adulterated with sugar syrup : దేశంలో విక్రయించే తేనే బ్రాండ్లలో 77శాతం కల్తీవేనని తేల్చి చెప్పింది పర్యావరణ నిఘా సంస్ధ ,సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరానమెంట్. ప్రజలు అత్యంత నమ్మకం కలిగి కొనుగోలుచేసే బ్రాండ్లలో కూడా కల్తీ ఉందని…..వాటిలో చక్కెర పాకం కలిపి అమ్ముతున్నట్లు సీఎస్‌ఈ పరిశోధనలో తేలింది.

సంస్ధ దేశంలో ప్రముఖంగా అమ్ముడవుతున్న 13 రకాల బ్రాండ్లను, మరి కొన్ని చిన్న బ్రాండ్ల శాంపిల్స్ ను సేకరించి వాటిని పరీక్షించటంతో ఈ మోసం బయటపడింది. వీటిలో 77శాతం చక్కెర పాకం కలిపి అమ్మేస్తున్నారని తేల్చింది. 22 శాంపిళ్లలో కేవలం ఐదు శాంపిళ్లు మాత్రమే స్వఛ్చత విషయంలో అన్ని పరీక్షల్లోనూ నెగ్గాయని సంస్ధ పేర్కోంది.



ప్రత్యేకించి దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే ప్రధాన బ్రాండ్లు కల్తీ చేస్తుండటం సర్వత్రా విస్మయానికి గురుచేస్తోంది.ప్రముఖబ్రాండ్లైన ‘‘డాబర్, పతంజలి, బైద్యనాథ్, జండూ, హిత్కారీ, అపిస్ హిమాలయా తదితర బ్రాండ్లకు చెందిన శాంపిళ్లన్నీ ఎన్ఎంఆర్ (న్యూక్లియర్ మాగ్నటిక్ రిజొనన్స్) పరీక్షలో విఫలం అయ్యాయి..’’ అని సెంటర్ ఫర్ సైన్స్ చేసిన అధ్యయనంలో పేర్కొంది.



కాగా సీఎస్ఈ విడుదల చేసిన నివేదికను తెనే విక్రయించే ప్రముఖ సంస్ధలు ఖండించాయి. ఇమామి (జాండు) ప్రతినిధి మాట్లాడుతూ, “ఇమామి ఒక బాధ్యతాయుతమైన సంస్థగా, దాని జాండు స్వచ్ఛమైన తేనె భారత ప్రభుత్వం మరియు దాని అధీకృత సంస్థలైన ఎఫ్ఎస్ఎస్ఎఐ వంటి అన్ని నాణ్యతా ప్రమాణాలు అనుసరించి  ఉందని, దానికి కట్టుబడి ఉందని తెలిపింది.

డాబర్ కూడా ఈ వాదనను ఖండించింది. ఇటీవలి నివేదికలు మా బ్రాండ్‌ను అపఖ్యాతిపాలు చేయడమే లక్ష్యంగా ఈ నివేదికలు ఉన్నాయి అని ఆరోపించింది. “డాబర్ తేనె 100 శాతం స్వచ్ఛమైనదని మేము మా వినియోగదారులకు భరోసా ఇస్తున్నాము. ఇది 100 శాతం స్వదేశీ, భారతీయ వనరుల నుండి సహజంగా సేకరించి, చక్కెర లేదా ఇతర కల్తీ పదార్థాలతో లేనది అని భరోసా ఇస్తున్నామని పేర్కోంది.



డాబర్ ఎటువంటి తేనె / సిరప్ దిగుమతి చేసుకోదని మేము మా వినియోగదారులకు హామీ ఇస్తున్నాము. మా తేనె పూర్తిగా భారతీయ తేనెటీగల పెంపకందారుల నుండి సేకరిస్తున్నదని డాబర్ ఒక ప్రకటనలో తెలిపింది. తేనెను పరీక్షించడానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశించిన మొత్తం 22 పారామితులను డాబర్ పాటిస్తున్నట్లు తెలిపింది.

పతంజలి ఆయుర్వేద్ ప్రతినిధి ఎస్కె టిజారావాలా మాట్లాడుతూ, “మేము సహజ తేనెను మాత్రమే తయారు చేస్తాము, దీనిని ఫుడ్ రెగ్యులేటర్ FSSAI ఆమోదించింది. మా ఉత్పత్తి FSSAI నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని చెప్పారు. ఇది దేశంలోని “సహజ తేనె ఉత్పత్తిదారులను కించపరిచే కుట్ర” అని ఆయన ఆరోపించారు.



“ఇది జర్మన్ సాంకేతిక పరిజ్ఞానం మరియు ఖరీదైన యంత్రాలను విక్రయించే కుట్ర. ఇది దేశంలోని సహజ తేనె ఉత్పత్తిదారులను కించపరచడానికి మరియు ప్రాసెస్ చేసిన తేనెను ప్రోత్సహించడానికి కూడా కుట్ర. ఇది ప్రపంచ తేనె మార్కెట్లో భారతదేశం యొక్క సహకారాన్ని కూడా తగ్గిస్తుంది” అని ఆయన అన్నారు.