దేశ పౌరులకు ఒక్కొక్కరికి రూ.90వేలు ఇస్తున్న ప్రభుత్వం.. ఎందుకో తెలుసా..

హాంకాంగ్ దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయింది. ఆర్థిక

  • Published By: veegamteam ,Published On : February 26, 2020 / 08:52 PM IST
దేశ పౌరులకు ఒక్కొక్కరికి రూ.90వేలు ఇస్తున్న ప్రభుత్వం.. ఎందుకో తెలుసా..

హాంకాంగ్ దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయింది. ఆర్థిక

హాంకాంగ్ దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయింది. ఆర్థిక మాంద్యంతో హాంకాంగ్ కుదేలైంది. ఆ దేశ కరెన్సీ విలువ పడిపోయింది. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గింది. తీవ్రమైన ఆర్థిక మాంద్యం, ఆర్థిక సంక్షోభం హాంకాంగ్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కేందుకు, ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దేశంలోని పౌరులకు ఒక్కొక్కరికి రూ.90వేలు నగదు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. 

ప్రతి పౌరుడికి రూ.90వేల నగదు:
ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేందుకు.. ప్రభుత్వం 120 బిలియన్ హాంకాంగ్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో భాగంగా దేశంలోని ప్రతి పౌరుడికి రూ. 10వేల హాంగ్ కాంగ్ డాలర్ (భారత కరెన్సీలో రూ.90వేలు) ఇవ్వనుంది. కేవలం పర్మినెంట్ పౌరులకు మాత్రమే ఈ మొత్తాన్ని ఇస్తుంది. అది కూడా 18ఏళ్లు పైబడిన వారికే. ఈ ప్యాకేజీ ద్వారా 70లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని అధికారులు అంచనా వేశారు.

తీవ్ర ఆర్థిక సంక్షోభం:
గత 15ఏళ్లలో ఇంత ఆర్థిక మాంద్యం పరిస్థితులు రావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. 2019 అక్టోబర్ నుంచి హాంకాంగ్ లో ఆర్థిక మాంద్యం పరిస్థితులు మొదలయ్యాయి. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని, ఆర్థిక లోటు మరింత పెరగొచ్చని భయపడుతున్నారు. ఈ ఏడాది హాంకాంగ్ ఆర్థిక వ్యవస్థ అపారమైన సవాళ్లను ఎదుర్కొంటోందని, సమీప కాలంలో పరిస్థితులు ఆశాజనకంగా లేవని అధికారులు వాపోయారు.

ఎకానమీపై కరోనా వైరస్ ఎఫెక్ట్:
హాంకాంగ్ లో కొంతకాలంగా జరుగుతున్న ఆందోళనలు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం.. హాంకాంగ్ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారడానికి ప్రధాన కారణాలని ఆ దేశ ఆర్థిక శాఖ మంత్రి తెలిపారు. ఫలితంగా దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ఆందోళనలు, ట్రేడ్ వార్ కి కరోనా వైరస్ తోడైందని, కరోనా వైరస్ ఎఫెక్ట్ తో హాంకాంగ్ ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలైందని వివరించారు. ఆర్థిక సంక్షోభం, ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొన్ని వర్గాల ప్రజలకు ఆదాయ పన్ను మొత్తాన్ని తగ్గించింది. అలాగే ప్రభుత్వ గృహాలలో తక్కువ ఆదాయ నివాసితులకు నెలకు ఉచిత అద్దె ఇవ్వాలని, అలాగే 2లక్షల మంది నిరుపేద గృహాలకు భత్యం ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు.

ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు చర్యలు:
ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు కొన్ని నెలలుగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే 30 బిలియన్ల హాంకాంగ్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన అనేక రౌండ్ల ఉద్దీపన ప్యాకేజీలు రూపొందించింది. సవాళ్లు ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. హాంకాంగ్ ఆర్థిక వ్యవస్థపై 2003 లో SARS చూపిన  ప్రభావం కంటే.. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేశారు. కరోనా వైరస్ పూర్తిగా పోయిన తర్వాత..హాంకాంగ్ ఆర్థిక వ్యవస్థ కోలుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.