‘కంత్రీ’ డ్రాగన్.. చైనా వ్యాపారం మనతోనే.. దాడులూ మనపైనేనా..?

చైనా వ్యాపారం చేసేది మనతోనే.. దాడులు కూడా మనపైనేనా..? చేస్తోంది డ్రాగన్.. ఇప్పుడు చైనా వైఖరి ఇలానే కనిపిస్తోంది. 2019 కేలండర్ ఇయర్‌ని చూస్తే.. నవంబర్ నెల వరకే చైనా భారత్ వాణిజ్యం 84.3 బిలియన్ డాలర్లకి చేరింది.. అంటే రూ. 6 లక్షల 375కోట్లు పైమాటే.. (63,75,61,32,15,000) ఇంత భారీ ట్రేడ్‌లో చైనా ఉత్పత్తులు ఎంత ఎక్కువగా దిగుమతి అవుతున్నాయంటే.. అంత ఎక్కువగా క్రీడారంగంలో చైనా బ్రాండ్లు ప్రమోట్ అవతున్నాయ్..
దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.. ఐపిఎల్‌ని Vivo దక్కించుకోవడమే. రాబోయే ఐదేళ్లకు రూ. 2199 కోట్ల ఖర్చు పెట్టి మరీ స్పాన్సర్‌షిప్ దక్కించుకుంది వివో.. ఇది అంతకు ముందటి కాంట్రాక్ట్‌తో పోల్చుకుంటే.. 554శాతం ఎక్కువ.. అంటే మన దేశంలో ఏ ఆటకు ఎంత క్రేజో.. ఎక్కడ తాను ఖర్చుపెడితే తన ఉత్పత్తులు అమ్ముడవుతాయో చైనా కంపెనీలకు బాగా తెలుసు. ఒక్క స్పోర్ట్స్ మార్కెట్ మాత్రమే కాదు.. ఇండో చైనా ద్వైపాక్షిక వాణిజ్యం కూడా భారీగా పెరుగుతూ వచ్చింది..
వివో.. ప్రోకబడ్డీకి కూడా ఐదేళ్లపాటు టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం రూ. 300 కోట్లు ఖర్చు పెట్టింది. ఇదే సమయంలో వివో పోటీదారు కంపెనీ 2017లో ఒప్పో టీమిండియా జెర్సీ స్పాన్సర్‌షిప్‌ని దక్కించుకుంది. అటు ఒప్పో కానీ.. వివో కానీ రెండూ చైనా బ్రాండ్లే.. ఇవే భారీగా స్మార్ట్ ఫోన్లు తయారు చేస్తున్నాయ్.. ఇదే సమయంలో వారిని ఆకట్టుకోవాలంటే క్రికెట్‌ని మించిన ఆట లేదనే విషయాన్ని కనిపెట్టేసి తమ వ్యాపారం పెంచేసుకుంటున్నాయ్ డ్రాగన్ కంపెనీలు.
బైజుస్ ఆన్ లైన్ లెర్నింగ్ యాప్ అకస్మాత్తుగా ఈ దిగ్గజాల మధ్యకు దూసుకురావడమే కాకుండా టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా అవతరించింది. ఐతే బైజుస్ పూర్తిగా భారత్‌కి చెందిన కంపెనీగా కన్పించినా ఇందులో చాలా మల్టీనేషనల్ కంపెనీలకు వాటాలున్నాయ్. వాటిలో చైనా బేస్డ్ టెన్సెంట్ ప్రముఖమైనది. 2017లో టెన్సెంట్ బైజుస్‌లో 40 మిలియన్ డాలర్ల (రూ. 302కోట్లు) పెట్టుబడి పెట్టింది. 2019లోనూ తన ఇన్వెస్ట్‌మెంట్ కొనసాగించింది. ఇప్పుడు బైజుస్‌ని చైనా కంపెనీగా ముద్ర వేయడం కరెక్టేనా అనే ప్రశ్న రాకతప్పదు.
ఇక పేటిఎం సంగతి చూస్తే.. ఇండియాలో ఇంటర్నేషనల్, డొమెస్టిక్ క్రికెట్ మ్యాచ్‌లకు స్పాన్సర్‌గా వ్యవహరించింది. పేటిఎంలో చైనా ఆలీబాబా కంపెనీకి 600 మిలియన్ డాలర్ల పెట్టుబడులున్నాయ్. డ్రీమ్ లెవన్ అనే ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్.. 2018లో ఐపిఎల్‌కి స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఇందులోనూ టెన్సెంట్ కంపెనీ 100మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్ ఉంది..
ఇదే డ్రీమ్ లెవన్ ఇండియన్ సూపర్ లీగ్‌కి అధికారిక స్పాన్సర్ కూడా… 2019 ఐపిఎల్ అసోసియేట్ స్పాన్సర్స్ అయిన్ స్విగీ.. మేక్‌మై ట్రిప్స్ కంపెనీల్లోనూ చైనా కంపెనీల పెట్టుబడుల సంఖ్య కోట్లరూపాయల్లోనే ఉంటుంది. ఈ ఉదాహరణలన్నీ చూసిన తర్వాత… దేశంలో ఏ కంపెనీకి జాతీయభావం ఆపాదించాలి.. ఏ కంపెనీని చైనా కంపెనీగా నిషేధించాలనే గందరగోళం సహజం.. దానికి తోడు ప్రభుత్వం కూడా బాయ్‌కాట్ చైనా స్లోగన్ విషయంలో క్లియర్ డైరక్షన్స్ ఇవ్వలేదు.
అప్పటిదాకా చైనా మ్యాప్‌లను తగలబెట్టడం, చైనా నాయకుల దిష్టిబొమ్మలు తగలబెట్టడం.. ఇదంతా నూటికి నూరుపాళ్ళు మన ఆవేదనని తెలియజేయడమే. కానీ, ఆ కసి.. ఆ కోపం.. ఆ తెగువ.. నీటి బుడగలా మారిపోకూడదు. చైనా ప్రోడక్ట్స్‌ల్ని బ్యాన్ చేయాల్సి వస్తే.. మళ్ళీ ‘మేడిన్ చైనా’ అన్న మాటే మన దేశంలో వినకూడదు. మరి, అంత చిత్తశుద్ధి మనలో వుందంటారా.? ఇది సగటు భారతీయుడికి అగ్ని పరీక్షనే చెప్పాలి. బైకాట్ చైనా అనేది ఎంతవరకు ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.