Tech Tips : డెస్క్‌టాప్ WhatsAppలో Dark Theme ఎనేబుల్ ఇలా

  • Published By: sreehari ,Published On : February 8, 2020 / 12:45 AM IST
Tech Tips : డెస్క్‌టాప్ WhatsAppలో Dark Theme ఎనేబుల్ ఇలా

ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ వచ్చింది. అదే.. డార్క్ మోడ్ ఫీచర్. ప్రపంచవ్యాప్తంగా పది లక్షలకు పైగా మంది యూజర్లతో వాట్సాప్ ఎంతో పాపులర్ అయింది. ఫేస్ బుక్ సొంత యాప్‌ వాట్సాప్ ఎప్పటికప్పుడూ తమ యూజర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పుడు అందరి దృష్టి డార్క్ థీమ్ ఫీచర్ పైనే పడింది.

ప్రస్తుత రోజుల్లో ఈ డార్క్ థీమ్ బాగా ట్రెండ్ అయిపోయింది. డార్క్ థీమ్ ఫీచర్‌పై వర్క్ చేస్తున్నామని మెసేంజర్ సంస్థ ఇదివరకే ప్రకటించింది. మొబైల్ యూజర్ల కోసం ఈ కొత్త థీమ్.. అందుబాటులోకి రాబోతుందని, డెస్క్ టాప్ వెర్షన్ కూడా రిలీజ్ చేయనున్నట్టు తెలిపింది. వెబ్ వెర్షన్ కోసం వాట్సాప్ వర్క్ చేస్తున్నట్టు రుమార్లు వస్తున్నప్పటికీ ఎప్పుడు లాంచ్ అనేదానిపై క్లారిటీ లేదు.

వాట్సాప్ వెబ్ కోసం డార్క్ మోడ్ థీమ్ ఎనేబుల్ చేయాలంటే మీరు వాడే బ్రౌజర్ లేటెస్ట్ వెర్షన్ మెజిల్లా ఫైర్ ఫాక్స్ లేదా గూగుల్ క్రోమ్ ఇన్ స్టాల్ చేసి ఉండాలి. డెస్క్ టాప్ వెర్షన్ పై డార్క్ థీమ్ ఎనేబుల్ చేయడానికి XDA మెంబర్ m4heshd ఒక మోడ్ క్రియేట్ చేశారు. FYI వాట్సాప్ మోడెడ్ వెర్షన్ కాదు. ప్రస్తుత మీ వాట్సాప్ డెస్క్ టాప్ స్టయిలింగ్ మాడిఫై చేస్తుంది మాత్రమే. ఈ సోర్స్ కోడ్ ద్వారా ఎవరైనా యాక్సస్ చేసుకోవచ్చు.

100 శాతం సురక్షితం కూడా అని ఒక వెబ్ సైట్లో రాసి ఉంది. మైక్రోసాఫ్ట్ స్టోర్ లేదా యాప్ స్టోర్ వెర్షన్ వాట్సాప్ డెస్క్ టాప్ తో ఈ మోడల్ సపోర్ట్ చేయదు. ఈ మోడ్ ఒక ఓపెన్ సోర్స్ కావడంతో.. డెవలపర్ మీ మెసేజ్ లను చూడలేరు లేదా మీ కాల్స్ కూడా ట్యాప్ చేయలేరు. ఈ మోడ్ ద్వారా కేవలం స్టయిల్ మాత్రమే మారుతుంది తప్ప ఫంక్షనాలటీ కాదని గుర్తించాలి.

* https://www.whatsapp.com/download లింక్ కాపీ చేయండి.
* WhatsApp డెస్క్ టాప్ వెర్షన్ Direct డౌన్ లోడ్ చేయండి.
* GitHub నుంచి విండోస్ లేదా మ్యాక్OS కోసం డార్క్ మోడ్ ఎంచుకోండి.
* వాట్సాప్ డెస్క్ టాప్ Dark Mode స్టయిలింగ్ డౌన్ లోడ్ చేయండి.
* Windows (32Bit/64Bit) కోసం  ఈ Link క్లిక్ చేయండి.
* MacOS వెర్షన్ కోసం ఈ Link క్లిక్ చేయండి.
* zip ఫైల్ ఓపెన్ చేసి WADark.exe లేదా WADark ఒకే పోల్డర్ లో Extract చేయండి.
* డార్క్ మోడ్ థీమ్ ఇన్ స్టాల్ పూర్తియ్యేదాక వేచిచూడండి.
* ఇదే స్ర్కిప్ట్ ను తిరిగి రన్ చేయడం ద్వారా Light Modeకు మారవచ్చు.