పెట్రోల్ ధరల్లో.. హైదరాబాద్ రెండో ఖరీదైన మెట్రో సిటీ

దేశంలో పెట్రోల్ లభించే మెట్రో పాలిటన్ నగరాల్లో అత్యంత ఖరీదైన రెండో నగరంగా హైదరాబాద్ నిలిచింది.

  • Published By: sreehari ,Published On : September 24, 2019 / 11:08 AM IST
పెట్రోల్ ధరల్లో.. హైదరాబాద్ రెండో ఖరీదైన మెట్రో సిటీ

దేశంలో పెట్రోల్ లభించే మెట్రో పాలిటన్ నగరాల్లో అత్యంత ఖరీదైన రెండో నగరంగా హైదరాబాద్ నిలిచింది.

రోజురోజుకీ ఇంధన ధరలు మండిపోతున్నాయి. సౌదీ అరేబియన్ ముడిచమురు రంగంలో తీవ్ర సంక్షోభం నెలకొనడంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాన మెట్రో పాలిటన్ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. రెండు వారాల్లోనే కనీసం రూ.2 చొప్పున ఇంధన ధరలు పెరిగాయి. దేశంలో పెట్రోల్ లభించే మెట్రో పాలిటన్ నగరాల్లో అత్యంత ఖరీదైన రెండో నగరంగా హైదరాబాద్ నిలిచింది.

సౌదీ అరేబియన్ లో సంక్షోభం కారణంగా గ్లోబల్ ఆయిల్ ధరలు రానున్న 10 రోజుల్లో ఇంధన ధరలు మరో రూ.5 పెరిగే అవకాశం ఉందని డీలర్స్ అంచనా వేస్తున్నారు. సోమవారం (సెప్టెంబర్ 23, 2019) రోజున లీటర్ పెట్రోల్ ధర రూ.78.39 ఉండగా.. డీజిల్ ధర రూ.72.79తో స్థిరంగా ఉంది. పెట్రోల్, డీజిల్ మధ్య ధరల్లో ఇప్పటివరకూ కనీస వ్యత్యాసం లీటర్ ధర రూ. 5.6గా ఉంది. అంతకుముందు రెండెంటీ మధ్య రూ.25 నుంచి రూ.30 వరకు వ్యత్యాసం ఉంది.

దేశంలోని మెట్రో పాలిటన్ నగరాల్లో అత్యధికంగా పెట్రోల్ ధరలు కలిగి ఉన్న నగరంగా ముంబై తొలి స్థానంలో ఉండగా.. హైదరాబాద్ నగరం మాత్రం రెండో స్థానంలో నిలిచింది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.76.44గా ఉండగా.. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.83గా నమోదైంది. ఇక ముంబైలో రూ.79.57 ఉండగా, ఢిల్లీ రూ.73.91, జైపూర్ రూ.77.81, అహ్మదాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.71.32గా ధర పలుకుతోంది. 2017లో డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రెగ్యులర్ ఫీచర్ లో రోజువారీ ఇంధన ధరలు రివైజ్ చేస్తున్నారు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చుతగ్గుదలతో ఎక్కువ శాతం పెరిగాయానే చెప్పాలి.

సెప్టెంబర్ 9 నుంచి పెట్రోల్ ధర రూ.76.05గా మొదలై సెప్టెంబర్ 23నాటికి లీటర్ పెట్రోల్ ధర రూ.78.39 వరకు పెరిగింది. డీజిల్ ధర కూడా లీటర్ కు రూ.70.09 నుంచి రూ.72.79 వరకు పెరిగింది. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోషియేషన్ డేటా ప్రకారం.. గత రెండు వారాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ కు రూ.2 చొప్పున పెరిగినట్టు తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్యూటీ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ వరుసగా తగ్గించడంతో ఇంధన ధరలు క్రమేపీ పెరుగుతూ వచ్చాయని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జి.వినయ్ కుమార్ తెలిపారు.