Survey: సొంతింటి కలకు హాట్ ఫేవరెట్ హైదరాబాద్.. క్యూ కడుతున్న NRIలు

తాజాగా ఎన్ఆర్ఐ డిమాండుతో ఈ తొమ్మిది నెలల్లో దేశంలో 15-20 శాతం గృహ నిర్మాణం పెరిగిందట. ఈ మధ్య కాలంలోనే దేశంలో కొత్తగా 2.73 లక్షల కొత్త నివాస సముదాయాలు నిర్మాణం అయినట్లు ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా విదేశాల్లో నివసిస్తున్న వారు.. తిరిగి భారత్ రావాలని ఆసక్తి చూపుతున్నారని, దేశంలో గృహ నిర్మాణం పెరగడానికి ఇదొక కారణమని ఆయన అన్నారు.

Survey: సొంతింటి కలకు హాట్ ఫేవరెట్ హైదరాబాద్.. క్యూ కడుతున్న NRIలు

Hyderabad, Delhi, Bengaluru Top Choices For NRIs Buying Homes

Survey: ప్రవాస భారతీయులు ఇళ్లు కొనుక్కునేందుకు దేశంలోనే అత్యంత అనువైన నగరంగా హైదరాబాద్ నిలిచింది. ఈ యేడాదిలో టాప్-5లో ఉన్న హైదరాబాద్.. ఏడాది చివరికి వచ్చేసరికి నెంబర్ 1 స్థానంలో నిలవడం గమనార్హం. సీఐఐ-అనరోక్ కన్యూమర్ సెంటిమెంట్ సర్వే ఈ వివరాలను వెల్లడించింది. హైదరాబాద్ తర్వాత దేశ రాజధాని ఢిల్లీ రెండవ స్థానంలో ఉండగా, ఇండియన్ సిలికాన్ వాలీగా పేరుగాంచిన బెంగళూరు మూడవ స్థానంలో నిలిచింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నాలుగో స్థానం దక్కించుకుంది.

సీఐఐ-అనరోక్ కన్యూమర్ సెంటిమెంట్ నిర్వహించిన ఈ సర్వేలో హైదరాబాద్ 22 శాతం ఓట్లు సాధించగా.. ఢిల్లీకి 20 శాతం ఓట్లు, బెంగళూరుకు 18 శాతం ఓట్లు వచ్చాయట. ప్రవాస భారతీయులు తిరిగి స్వదేశంలో నివాసం ఏర్పరుచుకునే విషయంలో హైదరాబాద్ బెస్ట్ చాయిస్‭గా ఎంచుకుంటున్నట్లు సర్వే తెలిపింది. గృహ రుణాలపై వడ్డీ రేట్లు, ప్రాపర్టీ ధరలు పెరిగినప్పటికీ దేశంలో గృహ నిర్మాణం సెంటిమెంట్ బలంగానే ఉందట. అయితే డాలర్‭తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడంతో ఎన్ఆర్ఐలకు ఆర్థికంగా బాగా కలిసి వస్తోందని, ఎక్కువ గృహ నిర్మాణాలకు ఇది ఊతం ఇస్తోందని అనరోక్ గ్రూప్ సీనియర్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు.

తాజాగా ఎన్ఆర్ఐ డిమాండుతో ఈ తొమ్మిది నెలల్లో దేశంలో 15-20 శాతం గృహ నిర్మాణం పెరిగిందట. ఈ మధ్య కాలంలోనే దేశంలో కొత్తగా 2.73 లక్షల కొత్త నివాస సముదాయాలు నిర్మాణం అయినట్లు ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా విదేశాల్లో నివసిస్తున్న వారు.. తిరిగి భారత్ రావాలని ఆసక్తి చూపుతున్నారని, దేశంలో గృహ నిర్మాణం పెరగడానికి ఇదొక కారణమని ఆయన అన్నారు.

CM Jagan BioEthanol Plant : రూ.270 కోట్లతో ఇథనాల్ ప్లాంట్.. రైతులకు, నిరుద్యోగులకు ఎంతో ఉపయోగమన్న సీఎం జగన్