Hyundai Discounts : మార్చిలో హ్యుందాయ్ సర్వీసులపై భారీ డిస్కౌంట్లు.. స్పెషల్ ఆఫర్లు ఇవే..!
Hyundai Discounts : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హ్యుందాయ్ (Hyundai) తమ కార్లపై మార్చిలో అనేక డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ నెలలో హ్యుందాయ్ సర్వీసుపై డిస్కౌంట్లను అందిస్తోంది.

Hyundai Discounts : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హ్యుందాయ్ (Hyundai) తమ కార్లపై మార్చిలో అనేక డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ నెలలో హ్యుందాయ్ సర్వీసుపై డిస్కౌంట్లను అందిస్తోంది. కార్ల తయారీదారు భారత మార్కెట్లో హ్యుందాయ్ వెర్నా 2023 (Hyundai Verna) లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం హ్యుందాయ్ తమ కస్టమర్ల కోసం ప్రత్యేక సర్వీసు ఆఫర్‌లతో ముందుకు వచ్చింది. కంపెనీ అందించే ప్రీ-సమ్మర్ క్యాంప్‌లో భాగంగా మార్చి 17 నుంచి మార్చి 30 వరకు సర్వీస్‌పై హ్యుందాయ్ డిస్కౌంట్‌లు అందిస్తోంది.
లేబర్ ఛార్జీలు, AC సమస్యలు, ఎక్స్‌టీరియర్స్, ఇంటీరియర్ బ్యూటిఫికేషన్ వంటివి వర్తిస్తాయి. హ్యుందాయ్ కస్టమర్లకు ఉచిత AC చెక్-అప్‌ను అందిస్తోంది. ఆ తర్వాత ఏసీ స్పేర్ పార్టులపై ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తోంది. హ్యుందాయ్ వినియోగదారులు AC సర్వీసింగ్‌పై 15శాతం లేబర్ డిస్కౌంట్, AC రిఫ్రిజెరాంట్ ఫిల్లింగ్‌పై 10శాతం తగ్గింపు, AC క్రిమిసంహారక మందులపై 10శాతం తగ్గింపును పొందవచ్చు.
అంతేకాకుండా, హ్యుందాయ్ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ రిటైల్‌పై 20శాతం తగ్గింపు, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ బ్యూటిఫికేషన్‌పై 10శాతం తగ్గింపు పొందవచ్చు. మెకానికల్ లేబర్‌పై 10శాతం తగ్గింపు అందిస్తోంది. భారత మార్కెట్లో హ్యుందాయ్ నెక్స్ట్ మోడల్ సరికొత్త 6వ జనరేషన్ వెర్నా.

Hyundai discounts on service in March_ Company introduces special offers
ఈ కారు ధర రూ. 9.99 లక్షల నుంచి రూ. 17 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర పరిధిలో లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. హ్యుందాయ్ వెర్నా 2023 భారత మార్కెట్లో అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా ఉంది. ఇందులో 30 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు, 17 లెవెల్ 2 ADAS ఫీచర్లతో హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్, టాప్-స్పెక్ వేరియంట్ కోసం 65 కన్నా ఎక్కువ అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్నాయి.