ICICI Bank service charges: వచ్చే వారం నుంచి పెరగనున్న ఐసీఐసీఐ బ్యాంక్ ఛార్జీలు

ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ వచ్చే వారం నుంచి సర్వీసు ఛార్జీలు పెంచేయనుంది. డొమెస్టిక్ సేవింగ్ అకౌంట్ హోల్లర్లు నగదు ట్రాన్సాక్షన్లు, ఏటీఎం ఇంటర్‌ఛేంజ్, చెక్‌బుక్ ఛార్జీలను పెంచుతున్నట్లు నోటీస్ పంపింది.

ICICI Bank service charges: వచ్చే వారం నుంచి పెరగనున్న ఐసీఐసీఐ బ్యాంక్ ఛార్జీలు

Service Chargers

ICICI Bank Service charges: ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ వచ్చే వారం నుంచి సర్వీసు ఛార్జీలు పెంచేయనుంది. డొమెస్టిక్ సేవింగ్ అకౌంట్ హోల్లర్లు నగదు ట్రాన్సాక్షన్లు, ఏటీఎం ఇంటర్‌ఛేంజ్, చెక్‌బుక్ ఛార్జీలను పెంచుతున్నట్లు నోటీస్ పంపింది. పెంచిన ఛార్జీలను 2021 ఆగష్టు 1నుంచి అమల్లోకి తీసుకురానున్నారు.

పెరగనున్న ఛార్జీల వివరాలు:
1. మెట్రో ప్రాంతాలైన 6 లొకేషన్లలో ఉండేవారికి నెలలో జరిపే మొదటి 3ట్రాన్సాక్షన్లు ఫ్రీ.
2. ఇతర ప్రదేశాల్లో ఉండేవారికి నెలలో జరిపే మొదటి ఐదు ట్రాన్సాక్షన్లు ఫ్రీ.
3. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కు రూ.20, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కు రూ.8.50.
4. మొత్తం మీద ఐసీఐసీఐ బ్యాంక్ ఉచితంగా 4ట్రాన్సాక్షన్లు చేసుకునేందుకు అనుమతిస్తుంది.
5. బ్యాంక్ వెబ్ సైట్ ఆధారంగా పైన చెప్పిన వాటి కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్లు చేస్తే ఒక్కోదానికి రూ.150చొప్పున వసూలు చేస్తుంది.
6. అకౌంట్ ఉన్న బ్యాంక్ బ్రాంచ్ నుంచి ఒక నెలలో రూ.లక్ష డ్రా చేయాలనుకుంటే సర్వీస్ ఛార్జ్ లేకుండా డ్రా చేసుకోవచ్చు. లక్ష కంటే ఎక్కువైతే కనీసం రూ.150తగ్గకుండా ఛార్జ్ తప్పదు.
7. ఇతర బ్రాంచ్ లో ట్రాన్సాక్షన్ జరిపితే రోజుకు రూ.25వేల వరకూ ఫ్రీ. అంతకుమించి దాటితే రూ.వెయ్యికి రూ.5చొప్పున పెరుగుతుంది. అదనంగా మినిమం ఛార్జీ రూ.150 కూడా.
8. థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే రూ.25వేల వరకూ సర్వీస్ ఛార్జ్ ఉండదు. అంతకంటే ఎక్కువ చేస్తే కనీస ఛార్జ్ రూ.150కంటే అదనం.
9. 20 చెక్ లీవ్స్ వరకూ ఉచితమే. లిమిట్ దాటితే ప్రతి చెక్ లీవ్ కు రూ.20 చొప్పున 10 లీవ్స్ తీసుకోవచ్చు.
10. తొలి 4ట్రాన్సాక్షన్లకు ఉచితమే. అంతకుమించి ట్రాన్సాక్షన్ చేస్తే వెయ్యి రూ. 5చొప్పున పెరుగుతుంది. కనీసం రూ.150 తప్పనిసరి.

ఇప్పటికే ఎస్బీఐ ట్రాన్సాక్షన్స్ కు లిమిట్ పెట్టి అంతకంటే ఎక్కువ చేస్తే సర్వీస్ ఛార్జీ అంటూ వసూలు చేస్తుంది. ఇక అదే బాటలో ఐసీఐసీఐ కూడా..