Income tax: నగదు లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ కన్ను.. 20 వేలు దాటితే నిషేధం

నగదు రూపంలో జరిగే లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి పెట్టింది. నగదు రూపంలో ఇకపై రూ.20 వేలకు మించిన చెల్లింపులు జరపకూడదు. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి రూ.5 లక్షలకు మించిన నగదు తీసుకోకూడదు.

Income tax: నగదు లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ కన్ను.. 20 వేలు దాటితే నిషేధం

Income tax: నగదు రూపంలో జరిగే లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ దృష్టిపెట్టింది. నగదు లావాదేవీల ద్వారా ఆదాయపు పన్ను ఎగవేస్తున్నారన్న అభిప్రాయంతో ఇకపై వీటిని కూడా పర్యవేక్షించనుంది. రూ.20,000, ఆపై జరిగే నగదు లావాదేవీలన్నింటిపైనా నిషేధం విధించింది.

Gujarat: రోడ్డు సౌకర్యం లేని ఊరు.. మోకాలి లోతు నీటిలో గర్భిణి అయిన చెల్లిని భుజాలపై మోసుకెళ్లిన అన్న

రూ.20 వేలు దాటిన ప్రతి ట్రాన్సాక్షన్, ఇకపై బ్యాంకు సంబంధిత అకౌంట్స్ ద్వారానే జరగాలి. అలాగే నగదుకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల మధ్య రూ.2 లక్షలకు మించిన లావాదేవీ జరగకూడదు. అంటే రెండు లక్షల రూపాయలకు మంచిన డబ్బును క్యాష్ రూపంలో తీసుకోవడానికి లేదా ఇవ్వడానికి వీల్లేదు. అలాగే నగదు రూపంలో ఏదైనా ట్రస్టుకు లేదా పార్టీకి చెల్లించిన డబ్బు, విరాళాలపై మినహాయింపు పొందడానికి కూడా వీల్లేదు. హాస్పిటల్స్, ఫంక్షన్ హాల్స్‌ వంటి వాటిల్లో జరిగే చెల్లింపులు ఎక్కువగా నగదు రూపంలోనే జరుగుతున్నాయి. దీంతో వీటి ద్వారా పన్ను వసూలు కావడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం దీనిపై దృష్టి పెట్టింది. తాజాగా కొత్త నిబంధనలు రూపొందించింది.

Amit Shah: నేడు తెలంగాణలో అమిత్ షా పర్యటన.. మునుగోడు సభకు హాజరు.. షెడ్యూల్ ఇదే..

ఇకపై ఆస్పత్రుల్లో జరిగే నగదు లావాదేవీలపై నియంత్రణ ఉంటుంది. అలాగే పేషెంట్ పాన్ కార్డును ఆస్పత్రులు తప్పనిసరిగా నమోదు చేయాలి. ఇలా పాన్ కార్డు లేకుండా ఆస్పత్రుల్లో బిల్లులు తీసుకుంటే, వాటిపై చర్యలు తీసుకుంటారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో పెద్ద ఎత్తున చెల్లింపులు జరిపే వారిపై కూడా ఐటీ శాఖ నిఘా ఏర్పాటు చేయనుంది. ఇలా సేకరించిన సమాచారం ఆధారంగా ఆదాయపు పన్ను వివరాల్ని పరిశీలిస్తుంది.