కలర్స్ సంస్థపై ఐటీ దాడులు

కలర్స్ సంస్థపై ఐటీ దాడులు

బ్యూటీ అండ్ వెల్‌నెస్ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న కలర్స్ సంస్థపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. వెయిట్ తగ్గాలనుందా.. చర్మం మెరుపు పెరగాలా అంటూ ప్రకటనలు ఇచ్చే సంస్థ ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారుల పర్యవేక్షణలో ఉంది. బుధవారం అక్టోబరు 30న ఒకేసారి అన్ని చోట్లా దాడులు నిర్వహిస్తున్నారు. 

దేశ వ్యాప్తంగా ఉన్న 49 బ్రాంచులపై దాడులు జరుగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ లోని శ్రీనగర్ బ్రాంచి వేదికగా 2004 అక్టోబరు 6న 11మంది ఉద్యోగులతో మొదలైన ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా బ్రాంచులు నిర్వహిస్తుందని కలర్స్ తన అధికారిక వెబ్ సైట్ లో పేర్కొంది. 

16 సంవత్సరాల వ్యాపారంలో 10లక్షలకు పైగా కస్టమర్లకు 15వందల మంది వైద్యుల సహాయంతో సేవలు అందిస్తున్నట్లు అందులో పొందుపరిచారు. చర్మం, వెంట్రుకలు, ఆకారాల గురించి తమ వద్ద ట్రీట్మెంట్ దొరుకుతుందని అందులో సమాచారం ఉంచారు.