చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం : వేలానికి నీరవ్ పెయింటింగ్స్

  • Published By: venkaiahnaidu ,Published On : March 26, 2019 / 12:17 PM IST
చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం : వేలానికి  నీరవ్ పెయింటింగ్స్

పీఎన్ బీ రూ.13వేల కోట్ల స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీకి చెందిన ప్రభుత్వం సీజ్ చేసిన ఖరీదైన పెయింటింగ్ లను అధికారులు మంగళవారం(మార్చి-26,2019) అధికారులు వేలంపాట వేయనున్నారు. ముంబైలో ఇవాళ నీరవ్ కి చెందిన 68 పెయింటింగ్ లను బహిరంగ వేలంపాటలో పెట్టనున్నారు.50కోట్లకు పైనే ఇవి అమ్ముడుపోయే అవకాశముంది.బుధవారం,గురువారం కూడా ఆన్ లైన్ వేలం పాట జరుగనుంది.

నీరవ్ కి చెందిన అత్యంత ఖరీదైన పెయింటింగ్ లను వేలంపాట నిర్వహించేందుకు ఆదాయపన్ను శాఖకు ప్రత్యేక కోర్టు అనుమతిచ్చింది.దేశంలో ఇప్పటివరకు ట్యాక్స్ అధికారులు ప్రాపర్టీ,గోల్డ్,లగ్జరీ ఐటమ్స్ మరికొన్నింటిని మాత్రమే వేలంపాట వేసేవారు కానీ పెయింటింగ్ లను కాదని,ఇలా పెయింటింగ్ లను వేలం నిర్వహించడం ఇదే మొదటిసారని వేలం నిర్వాహకులు తెలిపారు.

పీఎన్ బీ స్కామ్ వెలుగులోకి వచ్చే కొన్ని రోజుల ముందే దేశం వదిలి పారిపోయిన నీరవ్ మోడీ ఇటీవల లండన్ పోలీసులకు దొరికిపోయాడు. లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్డు బెయిల్ నిరాకరించడంతో లండన్ జైళ్లో నీరవ్ రిమాండ్ లో ఉన్నాడు.నీరవ్ ని భారత్ తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.