భారత్‌లో ప్రతి నెల ముగ్గురు బిలియనీర్లు తయారవుతున్నారు.. దటీజ్ ఇండియా

భారత దేశం ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులు ఉన్నాయి. గత పదేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని

  • Published By: veegamteam ,Published On : February 28, 2020 / 08:06 PM IST
భారత్‌లో ప్రతి నెల ముగ్గురు బిలియనీర్లు తయారవుతున్నారు.. దటీజ్ ఇండియా

భారత దేశం ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులు ఉన్నాయి. గత పదేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని

భారత దేశం ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. దేశంలో ఆర్థిక మందగమన(economic slowdown) పరిస్థితులు ఉన్నాయి. గత పదేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కోంటోంది. దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని పలువురు ఆర్థికవేత్తలు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పేదరికం, నిరుద్యోగం, పోషకాహార లోపం వంటి సమస్యలు ఎక్కువయ్యాయి. నిరుపేదల సంఖ్య పెరిగింది. ఇలాంటి ఆర్థిక మందగమన పరిస్థితుల్లోనూ భారత్ లో అద్భుతం జరుగుతోంది. మన దేశంలో బిలియనీర్ల(billionaries) సంఖ్య పెరుగుతోంది. ప్రతి నెల ముగ్గురు బిలియనీర్లు తయారవుతున్నారు. నమ్మబుద్ధి కాకపోయినా ఇది నిప్పులాంటి నిజం. హురున్ రిచ్(hurun rich) 2020 జాబితా ప్రకారం.. భారత్ లో బిలియనీర్ల సంఖ్య పెరుగుతోంది. 

భారత్ లో 138 మంది బిలియనీర్లు:
చైనా, అమెరికా(china, america) తర్వాత ప్రపంచంలో అత్యధిక మంది బిలియనీర్లు భారత్‌లోనే ఉన్నారు. దేశంలో 138 మంది డాలర్‌ బిలియనీర్లున్నట్లు హురున్‌ నివేదిక స్పష్టం చేసింది. 2019లో నెలకు దాదాపు ముగ్గురు చొప్పున డాలర్‌ బిలియనీర్లు పెరిగినట్లు 2019కిగాను విడుదలైన హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌-2020 తెలిపింది. 2019లో కొత్తగా 34 మంది బిలియనీర్లు అవతరించినట్లు వెల్లడించింది.

చైనా, అమెరికా తర్వాత భారత్ లోనే ఎక్కువమంది బిలియనీర్లు:
ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్న దేశాల్లో 799 మందితో చైనా మొదటి స్థానంలో ఉంటే, 626 మందితో అమెరికా రెండో స్థానంలో ఉంది. 138 మందితో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. విదేశాల్లో ఉన్న భారతీయులనూ కలిపితే ఈ సంఖ్య 170కి పెరిగింది. ఇక ఈ జాబితా బిలియన్‌ డాలర్లు అంతకంటే ఎక్కువ సంపద కలిగిన ప్రపంచంలోని 2,817 మందితో రూపొందింది.

గంటకు రూ.7 కోట్లు పెరిగిన ముకేష్ అంబానీ సంపద:
రిలయన్స్‌ అధినేత ముకేష్(mukesh ambani) అంబానీ 67 బిలియన్‌ డాలర్లతో టాప్‌-10లో ఉన్నారు. గంటకు రూ. 7 కోట్ల సంపద పెరిగింది. ఆసియాలోనే ధనవంతుడిగా మరోసారి నిలిచిన ముకేష్‌.. గ్లోబల్‌ టాప్‌-10 బిలియనీర్లలో ఉన్న ఏకైక ఆసియా దేశస్తుడు కావడం గమనార్హం. ఇక గౌతమ్‌ అదానీ సంపద 7.1 బిలియన్‌ డాలర్లు ఎగిసి 17 బిలియన్‌ డాలర్లకు చేరగా, ఈసారి 15 బిలియన్‌ డాలర్లతో టాప్‌-100 లిస్టులోకి ఉదయ్‌ కొటక్‌ చేరడం విశేషం. అలాగే 10.6 బిలియన్‌ డాలర్లకు డీ-మార్ట్‌(dmart) రాధాకిషన్ దమానీ(radhakishan damani) సంపద ఎగబాకింది. 

సత్తా చాటిన ఓయో రితేశ్‌ అగర్వాల్‌:
ఓయో(oyo) వ్యవస్థాపకుడు రితేశ్‌ అగర్వాల్‌(ritesh agarwal) ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ బిలియనీర్లలో అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఈయన వయసు 24 ఏళ్లు. సంపద విలువ 1.1 బిలియన్‌ డాలర్లు. కాగా, గోద్రేజ్‌ గ్రూప్‌ కి చెందిన స్మిత వి కృష్ణ భారతీయ సంపన్న మహిళగా నిలిచారు. ఈమె సంపద విలువ 4.5 బిలియన్‌ డాలర్లు.

oyo

బిలియనీర్ల జాబితాలో ఏడుగురు హైదరాబాదీలు:
బిలియనీర్ల జాబితాలో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు సంపన్నులకు స్థానం లభించింది. వీరి సంపద విలువ 13 బిలియన్‌ డాలర్లు. 50 మంది బిలియనీర్లతో ముంబై అగ్ర స్థానంలో ఉండగా, వీరి దగ్గరున్న సంపద విలువ దాదాపు 218 బిలియన్‌ డాలర్లు. ఢిల్లీలో 30 మంది, బెంగళూరులో 17 మంది, అహ్మదాబాద్‌లో 12 మంది ఉన్నారు. చాలా మంది బిలియనీర్లు ఔషధ, టెలికాం, టెక్నాలజీ, మీడియా పరిశ్రమల్లో పని చేస్తున్న వారే. కాగా, కరోనా వైరస్ వీరి వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖేష్ అంబానీ తన సంపదలో 5 బిలియన్లను కోల్పోయారు. ప్రపంచ స్థాయిలో చూస్తే అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ 140 బిలియన్ డాలర్ల నికర విలువతో అగ్రస్థానంలో నిలిచారు. 2019లో చైనాలో 182 మంది కొత్త బిలియనీర్లు తయారయ్యారు. ఇది అమెరికా కంటే మూడు రెట్లు ఎక్కువ.