ఈజీగా ప్రాపర్టీ కొనుక్కోవచ్చు : రియల్ ఎస్టేట్ కోసం ఈ-కామర్స్ పోర్టల్

  • Published By: sreehari ,Published On : November 5, 2019 / 11:29 AM IST
ఈజీగా ప్రాపర్టీ కొనుక్కోవచ్చు : రియల్ ఎస్టేట్ కోసం ఈ-కామర్స్ పోర్టల్

ఇండియాలో రియల్ ఎస్టేట్ రంగం కోసం ప్రత్యేకించి కొత్త ఈ-కామర్స్ ప్లాట్ ఫాం రాబోతోంది. 2020 జనవరిలో కొత్త ఈ-కామర్స్ పోర్టల్ లాంచ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. రియల్ ఎస్టేట్ లో ఇళ్ల క్రయవిక్రయాలు పారదర్శకంగా జరిగేందుకు వీలుగా కేంద్రం ఈ-కామర్స్ పోర్టల్ ప్రవేశపెడుతోంది.

‘వచ్చే మకర సంక్రాంతిలోగా రియల్ ఎస్టేట్ రంగం కోసం ఈకామర్స్ పోర్టల్ లాంచ్ చేయనున్నాం. దీనిపై క్రెడాయ్, నారెడ్కో రెండెంటితో చర్చలు జరిపినట్టు లక్నోలో జరిగిన తొలి జాతీయ RERA కాంక్లేవ్ సమావేశంలో గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పినట్టు మీడియా నివేదికలు తెలిపాయి. 

వచ్చే ఏడాది 2020లో జనవరి 15న మకర సంక్రాంతి పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారు. అదే రోజున రియల్ ఎస్టేట్ ఈకామర్స్ పోర్టల్ లాంచ్ చేయనున్నట్టు నివేదిక తెలిపింది. ఇందులో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులన్నింటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈకామర్స్ పోర్టల్లో పొందుపరచనుంది. ఆక్యూపెన్సీ సర్టిఫికేట్లు, ఇళ్ల సైజులు, ధరలు, కచ్చితమైన స్థలాలకు సంబంధించి ప్రాజెక్టుల వివరాలను వెబ్ సైట్లో అందుబాటులో ఉంచుతారు. 

ప్రపంచవ్యాప్తంగా కొనుగోలుదారులు ఎవరైనా సరే ఈ పోర్టల్ విజిట్ చేసి ఇండియాలో ఎక్కడైనా ప్రాపర్టీలను కొనుగోలు చేయొచ్చునని గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెక్రటరీ దుర్గా శంకర్ మిశ్రా చెప్పారు. నారెడ్కో, క్రెడాయ్ ద్వారా త్వరలోనే ఈ పోర్టల్ ప్రారంభించబోతున్నామని తెలిపారు. అమెజాన్ లేదా ఫ్లిప్ కార్ట్ మాదిరిగానే ఎంతో సులభంగా ప్రాపర్టీలను కొనుగోలు చేసుకోవచ్చునని మిశ్రా చెప్పారు.