Third largest economy: ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా భారత్ అవ‌త‌రించనుంది: నిపుణులు

ఇటీవలే బ్రిటన్ ను అధిగమించి ప్ర‌పంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా అవ‌త‌రించిన భారత్ భవిష్యత్తులో మరింత పుంజుకోనుందని నిపుణులు అంటున్నారు. 2030 నాటికి ప్ర‌పంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా భారత్ అవతరించనుందని చెప్పారు. భారత్ మూలధన వ్యయంపై దృష్టి పెట్టిందని ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ వీరమణి అన్నారు. చైనా కన్నా మనం చాలా వెనకబడి ఉన్నామని 20-30 ఏళ్ళుగా ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు ఆ అంచనాలు మారుతున్నారని తెలిపారు.

Third largest economy: ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా భారత్ అవ‌త‌రించనుంది: నిపుణులు

Third largest economy

Third largest economy: ఇటీవలే బ్రిటన్ ను అధిగమించి ప్ర‌పంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా అవ‌త‌రించిన భారత్ భవిష్యత్తులో మరింత పుంజుకోనుందని నిపుణులు అంటున్నారు. 2030 నాటికి ప్ర‌పంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా భారత్ అవతరించనుందని చెప్పారు. భారత్ మూలధన వ్యయంపై దృష్టి పెట్టిందని ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ వీరమణి అన్నారు. చైనా కన్నా మనం చాలా వెనకబడి ఉన్నామని 20-30 ఏళ్ళుగా ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు ఆ అంచనాలు మారుతున్నారని తెలిపారు.

బ్రిటన్ ను భారత్ అధిగమించడం ఇది రెండోసారని చెప్పారు. భారత్ రెవెన్యూ వ్యయాలను తగ్గించుకోవడం కోసం ప్రయత్నాలు జరుపుతోందని అన్నారు. ద్రవ్యోల్బణం విషయంలో భారతీయ రిజర్వు బ్యాంకు వ్యూహాలు భారత ఆర్థిక వ్యవస్థ బలపడడానికి ఉపయోగపడుతున్నాయని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంటే అదే సమయంలో యూకే ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోందని అన్నారు.

యూకేలో ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుండడం ఆ దేశ ఎన్నికల ప్రక్రియపై కూడా ప్రభావం చూపుతుందని మరో ఆర్థిక వేత్త చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ బలపడడం మనకు గర్వకారణమని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ కూడా చాలా కాలంగా చెబుతోందని తెలిపారు. భారత్ లో ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉందని, బ్రిటన్ లో మాత్రం బాగా పెరిగిపోతోందని చెప్పారు.

Pakistan floods: వరదలతో అతలాకుతలం.. ప్రపంచ దేశాల సాయం కోరుతూ పాకిస్థాన్ అభ్యర్థన