ఏప్రిల్ 1 నుంచి దేశంలో క్లీనెస్ట్ పెట్రోల్, డీజిల్

కాలుష్య ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే క్లీనెస్ట్ పెట్రోల్, డీజిల్‌గా పేరున్న యూరో-6 గ్రేడ్ ఇంధనాన్ని దేశవ్యాప్తంగా

  • Published By: veegamteam ,Published On : February 20, 2020 / 05:15 AM IST
ఏప్రిల్ 1 నుంచి దేశంలో క్లీనెస్ట్ పెట్రోల్, డీజిల్

కాలుష్య ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే క్లీనెస్ట్ పెట్రోల్, డీజిల్‌గా పేరున్న యూరో-6 గ్రేడ్ ఇంధనాన్ని దేశవ్యాప్తంగా

కాలుష్య ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే క్లీనెస్ట్ పెట్రోల్, డీజిల్‌గా పేరున్న యూరో-6 గ్రేడ్ ఇంధనాన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్రం ఏర్పాట్లు చేసింది. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. 2020 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా క్లీనెస్ట్ పెట్రోల్, డీజిల్ అందుబాబులోకి రానుంది. తద్వారా యూరో-6 ఇంధనం వినియోగిస్తున్న అతికొద్ది దేశాల సరసన భారత్ చేరనుంది. ఏప్రిల్ 1 నుంచి అత్యంత శుద్ధి ఇంధనం భారత్‌లో వినియోగంలోకి వస్తుంది.

కాలుష్యం తగ్గించడమే లక్ష్యం:
ప్రస్తుతం దేశవ్యాప్తంగా యూరో-4 లేదా భారత్ స్టేజ్(బీఎస్-6) ఇంధనాన్ని వాడుతున్నాం. బీఎస్-6 వాహనాలు అందుబాటులోకి వచ్చినా.. బీఎస్-4 గ్రేడ్ పెట్రోల్, డీజిల్ వినియోగిస్తున్నాం. దీంతో కాలుష్య ఉద్గారాలను అనుకున్న స్థాయిలో కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా యూరో-6 ఇంధనాన్ని అందుబాటులోకి తేనుంది కేంద్ర ప్రభుత్వం. యూరో-6 గ్రేడ్ ఇంధనం అత్యంత శుద్ధి చేసింది. దీని ద్వారా కాలుష్య ఉద్గారాలు భారీగా తగ్గుపోతాయి. ముఖ్యంగా.. ప్రమాదకరమైన సల్ఫర్ ఉద్గారాలు 10 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియమ్)కు తగ్గుతుంది. ఈ రణంగానే యూరో-6 ఇంధన వినియోగాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

మూడేళ్ల కాలంలోనే అప్ గ్రేడ్:
భారత్‌లో ప్రస్తుతం యూరో-4 ఇంధనం వినియోగంలో ఉంది. యూరో-4 నుంచి యూరో-5 అవసరం లేకుండానే భారత్ నేరుగా యూరో-6కి అప్‌గ్రేడ్ అవుతుండటం మరో విశేషం. అది కూడా ప్రపంచంలోని మిగతా దేశాలకు సాధ్యపడని రీతిలో కేవలం 3 ఏళ్ల కాలంలోనే ఇండియా ఈ ఘనత వహిస్తోంది. యూరో-6ను భారత్ బీఎస్-6గా వ్యవహరిస్తోంది.

బీఎస్-6 అందుబాటులోకి వచ్చినా బీఎస్-4 వాడకం:
దేశంలో అత్యాధునిక మోడళ్ల కార్లు, బైకుల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. కాలుష్య నియంత్రణ అంశంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన వాహనాల వినియోగం పెరిగింది. కానీ, వాటిని నడపడానికి వాడే పెట్రోల్, డీజిల్ గ్రేడ్ మాత్రం అప్‌డేట్ కాలేదు. బీఎస్-6 వాహనాలు అందుబాటులోకి వచ్చినా నేటికీ బీఎస్-4 గ్రేడ్ పెట్రోల్, డీజిల్ వినియోగిస్తున్నాం. దీంతో కాలుష్య ఉద్గారాలను అనుకున్న స్థాయిలో నియంత్రించలేకపోతున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. దేశంలోని మెట్రో నగరాలన్నీ భవిష్యత్తులో ఇదే పరిస్థితిని ఎదుర్కొనే ప్రమాదంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా బీఎస్-6 ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.

ఉత్పత్తి ప్రారంభించిన రిఫైనరీలు:
దేశంలోని అన్ని రిఫైనరీలు 2019 చివరి నాటికే యూరో-6 పెట్రోల్, డీజిల్ ఉత్పత్తిని ప్రారంభించాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ప్రతి ఇంధనం చుక్కను యూరో-6 గ్రేడ్‌గా మార్చబోతున్నాయని వెల్లడించారు. ఇప్పటికే అన్ని రిఫైనరీలు బీఎస్-6 ఇంధన సరఫరాను మొదలుపెట్టాయని.. దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యూయల్ స్టోరేజ్ డిపోలకు ఈ ఇంధనం చేరుతోందని తెలిపారు.

ధరలు పెరుగుతాయా?
ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న ఇంధనంతో పోలిస్తే.. యూరో-6 ఇంధనం ఉత్పత్తికయ్యే ఖర్చు కాస్త ఎక్కువేనని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. లీటర్ పెట్రోల్, డీజిల్ పై 50 పైసలు నుంచి రూపాయి వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు.

Read More>>Cut, Copy, Paste కనిపెట్టిన కంప్యూటర్ సైంటిస్ట్ ఇక లేరు