లాక్‌డౌన్‌లో నగదు విత్‌డ్రాపై IBA కొత్త రూల్స్ ఇవే

  • Published By: srihari ,Published On : May 3, 2020 / 05:06 AM IST
లాక్‌డౌన్‌లో నగదు విత్‌డ్రాపై IBA కొత్త రూల్స్ ఇవే

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కరోనా కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. లాక్ డౌన్ మూడో దశ.. మే 17వరకు కొనసాగనుంది. బయటకు వచ్చే పరిస్థితి లేదు. నిత్యావసరాలకు అవసరమైన నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లాల్సి వస్తోంది. అందుకే వినియోగదారుల సౌకర్యార్థం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. నగదు విత్ డ్రా చేసుకునేందుకు ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. బ్యాంకులకు వెళ్లడాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా IBA ఈ దిశగా చర్యలను చేపట్టింది. 

కరెన్సీ ద్వారా లావాదేవీలకు బదులుగా ఆన్ లైన్ (ఎలక్ట్రానిక్) లావాదేవీలు చేసేలా ప్రజలను ఎక్కువగా ప్రోత్సహిస్తోంది. బ్యాంకు బ్రాంచుల బయట భారీ క్యూలను తగ్గించేందుకు ఐబీఏ.. డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు నిర్దిష్ట తేదీలను కేటాయించింది. కస్టమర్ బ్యాంకు అకౌంట్ నెంబర్ లోని చివరి అంకెలో నిర్దిష్ట తేదీల ఆధారంగా ఇప్పుడు విత్ డ్రా చేసుకోవచ్చు. కొత్త నిబంధనల ప్రకారం.. బ్యాంకు అకౌంట్ నెంబర్లలో చివరి అంకెగా 0, 1 ఉన్నవారంతా మే 4న డబ్బును ఉపసంహరించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా 2, 3 ఉన్నవారు మే 5న వారి ఖాతాల నుండి డబ్బు తీసుకోవచ్చు. 4, 5 చివరి అంకెలు ఉన్న ఖాతాదారులు మే 6న విత్ డ్రా చేసుకోవచ్చు.

బ్యాంకు అకౌంట్ నెంబర్లలో చివరి అంకెలుగా 6, 7 ఉన్న కస్టమర్లు మే 8న విత్ డ్రా చేసుకోవచ్చు. 8, 9 ఉన్నవారు మే 11న నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. మే 11 వరకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. ఆ తర్వాత ఈ పరిమితులు ఎత్తివేస్తారు. అప్పటినుంచి ఎవరైనా ఏ రోజున అయినా నగదు ఉపసంహరించుకోవచ్చు. ఏప్రిల్‌లో IBA ఈ విధానాన్ని ప్రకటించింది. నగదు విత్ డ్రా చేసుకోనేందుకు పెద్ద సంఖ్యలో వినియోగదారులు బ్యాంకుల ముందు క్యూతో రద్దీగా మారుతున్నాయి. ఈ క్రమంలో సామాజిక దూరాన్ని అనుసరించలేరు. ఏటీఎం నుంచి ఛార్జీలు ఉండవు కాబట్టి వినియోగదారులు డబ్బును కూడా ఉపసంహరించుకోవచ్చనని IBA తెలిపింది.

మరోవైపు ప్రభుత్వం Pradhan Mantri Garib Kalyan Yojana కింద మహిళల ఖాతాల్లో రూ.500 జమ చేస్తోంది. ఈ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవడానికి తొందరపడవద్దని బ్యాంకులు ఖాతాదారులకు సూచించాయి. అకౌంట్లోనే సురక్షితమని చెబుతున్నాయి. మహిళలల అకౌంట్లో ఏప్రిల్ నెల డబ్బులు పడ్డాయని, మే నెల వాయిదా ప్రక్రియ నడుస్తోందని వెల్లడించాయి.