జెట్ కు ఫ్యూయల్ నిలిపేసిన ఐవోసీ

అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్ వేస్ కు ఇంధన సరఫరాని నిలిపివేస్తూ శుక్రవారం (ఏప్రిల్-5,2019) ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది.

  • Published By: veegamteam ,Published On : April 5, 2019 / 11:23 AM IST
జెట్ కు ఫ్యూయల్ నిలిపేసిన ఐవోసీ

అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్ వేస్ కు ఇంధన సరఫరాని నిలిపివేస్తూ శుక్రవారం (ఏప్రిల్-5,2019) ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్ వేస్ కు ఇంధన సరఫరాని నిలిపివేస్తూ శుక్రవారం (ఏప్రిల్-5,2019) ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం మధ్యాహ్నాం నుంచి జెట్ కు ఫ్యూయల్ సరఫరా నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు జెట్ దీనిపై స్పందించలేదు.
Read Also : గుడ్ బై… ఇండోర్ ప్రజలపై బాంబు పేల్చిన లోక్ సభ స్పీకర్

కొంతకాలంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో జెట్ ఉంది. ఒకప్పుడు భారతదేశ విమానయాన రంగానికి ముఖ చిత్రంగా ఉన్న జెట్ ఇప్పుడు కనీసం 15విమానాలను కూడా నడపలేకపోతుంది. జెట్ ఎయిర్ వేస్ ఫౌండర్ నరేష్ గోయల్, ఆయన భార్య అనితా గోయల్ బోర్డు నుంచి కూడా ఇటీవల తప్పుకున్నారు.

జెట్ ను ఆదుకునేందుకు రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యతను ఎస్ బీఐకి అప్పగించింది. ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకులు, రుణదాతల కన్సార్టియం జెట్‌ యాజమాన్య బాధ్యతలు తీసుకుంది. ఎస్ బీఐ నేతృత్వంలోని దేశీయ రుణదాతల కన్సార్టియం తీసుకున్న ఓ తీర్మాణ నిర్ణయాన్ని మార్చి-25, 2019న జెట్ బోర్డు ఆమోదించింది. దీని ప్రకారం ఎయిర్ లైన్ కు రూ.1500కోట్ల ఎమర్జెన్సీ ఫండింగ్ ఇచ్చేందుకు జెట్ ఎయిర్వేస్ బోర్డు  తీర్మానాన్ని ఆమోదించింది.
Read Also : బై..బై బాబు : జగన్ను సీఎం చేయండి – షర్మిల