కొన్నేళ్లుగా MNCలను శాసిస్తోన్న భారత CEOలు

  • Published By: veegamteam ,Published On : February 4, 2020 / 10:38 AM IST
కొన్నేళ్లుగా MNCలను శాసిస్తోన్న భారత CEOలు

అరవింద్ కృష్ణ (IBM) :

ibm
అరవింద్ కృష్ణ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్(IBM) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO) గా నియమితులయ్యారు. కృష్ణ ఐఐటీ కాన్పూర్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తర్వాత ఇల్లినాయిస్ యూనీవర్శీటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పీహెచ్ డీని పూర్తి చేశారు. ప్రస్తుతం అరవింద్ ఐబీఎం వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 6, 2020 న ఐబీఎం సీఈవోగా అరవింద్ కృష్ణ బాధ్యతలు చేపట్టనున్నారు.

సుందర్ పిచాయ్(Google,Alphabet) :

google
చెన్నైలో జన్మించిన సుందర్ పిచాయ్ గత ఏడాది డిసెంబర్ లో గూగుల్ పేరెంట్ అల్ఫాబెట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. 2015లో గూగుల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన పిచాయ్ ప్రస్తుతం కంపెనీ అధిపతిగా పనిచేస్తున్నారు.

సత్య నాదెళ్ల(Microsoft) :

microsoft
హైదరాబాద్ లో జన్మించిన సత్య నాదెళ్ల 2014 నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవోగా పని చేస్తున్నారు. సత్య నాదెళ్ల మంగుళూరు విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్, చికాగో విశ్వవిద్యాలయంలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ను పూర్తి చేశారు.

శాంతను నారాయణ్(Adobe) :

adobe
శాంతను నారాయణ్ కూడా హైదరాబాద్ కు చెందిన వ్యక్తి. నారాయణ్ అడోబ్ ఇంక్ చైర్ పర్సన్, ప్రెసిడెంట్, సీఈవోగా పనిచేస్తున్నారు. ఈయన 2005 లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) గా పనిచేశారు. ఓహియోలోని గ్రీన్ స్టేట్ యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీని పూర్తి చేశారు.

జయశ్రీ ఉల్లాల్(Arista Networks) :

arista network
2008 సంవత్సరం నుంచి జయశ్రీ ఉల్లాల్ క్లౌడ్ నెట్ వర్కింగ్ సంస్ధ అరిస్టా నెట్ వర్క్స్ సీఈవోగా ఉన్నారు. ఈమె లండన్ జన్మించారు. అయినప్పటికి ఆమె ఢిల్లీలో పెరిగారు. జయశ్రీ శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ , మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు.

సంజయ్ మెహ్రోత్రా(Micron) :

micron
సంజయ్ మెహ్రోత్రా ప్రస్తుతం మైక్రాస్ టెక్నాలజీలో ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు. ఈ సంస్థలో మే 2017 లో సంజయ్ చేరారు. ఇంతకు ముందు సంజయ్ శాన్ డిస్క్ కార్పోరేషన్ లో పని చేశారు. సంజయ్ మెహ్రోత్రా కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ను, కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీలను పూర్తి చేశారు.

జార్జ్ కురియన్(NetAPP) :

netapp
జార్జ్ కురియన్ నెట్ యాప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆ సంస్ధ యెుక్క బోర్డు సభ్యుల్లో ఒకడు. కురియన్ 2011 లో ఈ సంస్థలో చేరారు. 2015 లో ఈ సంస్థ సీఈవోగా ఎంపికయ్యారు. కురియన్ ప్రిన్ స్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్  పూర్తి చేశారు. స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు.
 

సందీప్ మత్రాణి(WeWork) :

wework

భారతీయ-అమెరికన్ రియల్ ఎస్టేట్ అనుభవజ్ఞల్లో సందీప్ మత్రాణి ఒకరు. ఈయన  wework కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO) గా నియమించనున్నారు. బ్రూక్ఫీల్డ్ ప్రాపర్టీస్ యెుక్క రిటైల్ గ్రూప్ సీఈవోగా పని చేసిన మత్రాణి కూడా కంపెనీ బోర్డు సభ్యుల్లో ఒకరిగా ఉన్నారు.