Stock Market: భారీ నష్టాల్లో భారత స్టాక్ మార్కెట్

సోమవారం ఉదయం నుంచే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం మార్కెట్లు తెరిచే సమయానికి 17535.30 వద్ద ప్రారంభమైన NSE.. ఆరంభంలోనే ఒడిదుడుకులు ఎదుర్కొంది.

Stock Market: భారీ నష్టాల్లో భారత స్టాక్ మార్కెట్

Stock Marekt

Stock Market: భారత స్టాక్ మార్కెట్లు NSE మరియు BSEలు తీవ్ర నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సోమవారం మార్కెట్లో అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు ఒక్కసారిగా పతనం అయ్యాయి. గత కొన్ని రోజులుగా భారత్ మార్కెట్లు ఆశాజనకంగా లేవు. దీనికి తోడు ఓమిక్రాన్ భయాలు, బ్రిటన్, రష్యా, అమెరికాల మధ్య జరుగుతున్న పరిణామాల మధ్య అంతర్జాతీయంగా నెలకొన్న గందరగోళం దేశీయ స్టాక్ మార్కెట్ల పై పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస ఐదో సెషన్ లోనూ నష్టాల్లో కొనసాగాయి. అమ్మకాల ఒత్తిడితో సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు సెన్సెక్స్ 1000కి పైగా పాయింట్లు నష్టపోయి 57900 వద్ద కొనసాగింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి “నిఫ్టీ” 320కి పైగా పాయింట్లు పతనం అయి 17300 కు చేరుకుంది.

Also read: Money Scam: కర్నూలు జిల్లాలో ప్రైవేటు కో-ఆపరేటివ్ సొసైటీ “ముద్ర” రూ.100 కోట్ల మోసం

సోమవారం ఉదయం నుంచే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం మార్కెట్లు తెరిచే సమయానికి 17535.30 వద్ద ప్రారంభమైన NSE.. ఆరంభంలోనే ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఒకానొక దశలో తిరిగి పుంజుకుంటుందని భావించినా.. అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(FOMC, USA) సమావేశం కానున్న నేపథ్యంలో ఆప్రభావం అంతర్జాతీయంగా ప్రతికూల ప్రభావం చూపింది. భారత మార్కెట్లోని బెంచ్‌మార్క్ సూచీలు సైతం ఆకట్టుకోలేకపోయాయి. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్ బ్యాంకు వంటి సంస్థల త్రైమాసిక ఫలితాలు అనుకూలంగానే ఉన్నా.. ఆ ప్రభావం మార్కెట్ లో ఏమాత్రం కనిపించలేదు.

Also read: Republic Day: గణతంత్ర దినోత్సవం వేళ బీహార్ లో హై అలెర్ట్