Indigo New Flights : మార్చి 27 నుంచి కొత్తగా 20 ఇండిగో విమాన సర్వీసులు..!

Indigo New Flights : దేశంలో తక్కువ ధరకే విమాన సర్వీసులను అందిస్తున్న ఇంటర్‌గ్లోబల్ ఏవియేషన్ ఇండిగో (Indigo) మార్చి 27 (ఆదివారం) నుంచి కొత్త ఇండిగో విమానాలను ప్రవేశపెడుతోంది.

Indigo New Flights : మార్చి 27 నుంచి కొత్తగా 20 ఇండిగో విమాన సర్వీసులు..!

Indigo New Flights Indigo To Introduce 20 New Flights On Various Routes From Mar 27

Indigo New Flights : దేశంలో తక్కువ ధరకే విమాన సర్వీసులను అందిస్తున్న ఇంటర్‌గ్లోబల్ ఏవియేషన్ ఇండిగో (Indigo) మార్చి 27 (ఆదివారం) నుంచి కొత్త ఇండిగో విమానాలను ప్రవేశపెడుతోంది. వేసవి షెడ్యూల్‌లో భాగంగా మొత్తం 20 కొత్త విమానాలను వివిధ మార్గాల్లో నడపనుంది. 20 కొత్త విమానాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. భారత మార్కెట్లో మార్కెట్ వాటా పరంగా అతిపెద్ద విమానయాన సంస్థగా పేరొందిన ఇండిగో.. 16 ప్రత్యేక విమానాల పునఃప్రారంభించనుంది. అలాగే 20 కొత్త విమానాలతో ప్రత్యేక మార్గాల్లో సర్వీసులను ప్రారంభించనుంది. ప్రయాగ్‌రాజ్, లక్నో మధ్య RCS సర్వీసులను ఇండిగో ప్రారంభించనుంది.

దేశీయ విమానాయన నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ 100 విమానాలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఇండిగో రెవిన్యూ అధికారి సంజయ్ కుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు. వివిధ రంగాలలో ప్రయాణ డిమాండ్‌కు అనుగుణంగా కొత్త మార్గాలను అన్వేషిస్తున్నామని ఇండిగో ముఖ్య వ్యూహమని సంజయ్ కుమార్ నివేదికలో తెలిపారు. పూణే-మంగళూరు, పూణే-విశాఖపట్నం, హుబ్లీ-హైదరాబాద్, జమ్ము-వారణాసి, తిరుపతి-తిరుచిరాపల్లి సహా పలు మార్గాల్లో ఇండిగో ప్రత్యేక విమానాలను ప్రారంభించనుంది. మార్చి 27, 2022 నుంచి ఈ కొత్త విమాన సర్వీసులు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. మార్చి 27న అంతర్జాతీయ గమ్యస్థానాలకు షెడ్యూల్ అయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా పునఃప్రారంభమవుతాయిని అన్నారు.

Indigo New Flights Indigo To Introduce 20 New Flights On Various Routes From Mar 27 (1)

Indigo New Flights Indigo To Introduce 20 New Flights On Various Routes From Mar 27 

COVID మహమ్మారి కారణంగా భారత్‌లో షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ విమానాలను మార్చి 23, 2020 నుంచి నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎయిర్ బబుల్ ఏర్పాట్ల కింద జూలై 2020 నుంచి భారత్ 37 దేశాల మధ్య ప్రత్యేక అంతర్జాతీయ విమానాలు నడుస్తున్నాయి. ఇండిగో జనవరి 2022 నాటికి 55.5శాతం మార్కెట్ వాటాతో భారత్ అతిపెద్ద ప్రయాణీకుల విమానయాన సంస్థగా నిలిచింది. ఆగస్టు 2006లో సర్వీసులను ప్రారంభించిన ఇండిగో ఎయిర్‌లైన్ మొత్తం 276 విమానాల సర్వీసులను అందిస్తోంది. ఇండిగో 73 దేశీయ గమ్యస్థానాలు, 24 అంతర్జాతీయ గమ్యస్థానాలతో మొత్తం 97 గమ్యస్థానాల్లో విమాన సర్వీసులను అందిస్తోంది.

Read Also : International Flights: భారత్ కు వచ్చే అంతర్జాతీయ విమానాలలో కోవిడ్ ఆంక్షలు తొలగింపు