Inflation in Japan: జపాన్‌లో 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిన ద్రవ్యోల్బణం

ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆర్థిక మాంద్యం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్న వేళ జపాన్ లో నెలకొన్న పరిస్థితులు ఆ దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జపాన్ లో 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. దీని ప్రభావం పిల్లలు ఉన్న కుటుంబాలపై తీవ్రంగా పడుతోందని ఎన్‌హెచ్‌కే వరల్డ్ తెలిపింది.

Inflation in Japan: జపాన్‌లో 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిన ద్రవ్యోల్బణం

Inflation

Inflation in Japan: ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆర్థిక మాంద్యం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్న వేళ జపాన్ లో నెలకొన్న పరిస్థితులు ఆ దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జపాన్ లో 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. దీని ప్రభావం పిల్లలు ఉన్న కుటుంబాలపై తీవ్రంగా పడుతోందని ఎన్‌హెచ్‌కే వరల్డ్ తెలిపింది.

గత నెలలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయని పేర్కొంది. జపాన్ వార్షిక వాణిజ్య లోటు-2022 కూడా భారీగా పెరిగింది. జపాన్ లో ఆహార పదార్థాలు, క్రూడాయిల్, బొగ్గు, నేచురల్ గ్యాస్ ధరలు పెరిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 2022లో ఏర్పడిన భారీ లోటు 1979 నుంచి ఇప్పటివరకు ఎన్నడూ సంభవించలేదు.

యెన్ మారక విలువ కూడా తగ్గిపోతోంది. ఇప్పటికే యూకే వంటి పలు దేశాల్లో ద్రవ్యోల్బణం, జీవన వ్యయం పెరిగిపోయింది. పాకిస్థాన్ లో వారాంతపు ద్రవ్యోల్బణం ఏకంగా 31.83 శాతానికి పెరిగింది. కొన్ని నెలల్లో ప్రపంచ ఆర్థిక మాంద్యం ఏర్పడవచ్చని నిపుణులు ఇప్పటికే పలుసార్లు హెచ్చరించారు. ప్రపంచంలోని పలు దేశాల ప్రజలు ముందు జాగ్రత్త చర్యగా పొదుపు మంత్రాన్ని పఠిస్తున్నారు. ఈ ఏడాది ఆర్థిక మాంద్యం కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే ముప్పూ ఉందని నిపుణులు చెబుతున్నారు.

Sexual Harassments IN Indian Sports: భారత క్రీడారంగంలో వేళ్లూనుకుపోయిన లైంగిక వేధింపులు? అయినా చర్యలు తీసుకోని దుస్థితి..క్రీడా స్ఫూర్తికి గొడ్డలిపెట్టుగా మారిన పరిస్థితి