ఈ గాడ్జెట్స్ లో మీరెన్ని వాడారు? దశాబ్దంలో బెస్ట్ గాడ్జెట్స్

దశాబ్దం మొత్తంలో యాపిల్ ప్రొడక్ట్సే టాప్‌గా నిలిచాయి. 2010లో ఒరిజినల్ ఐపాడ్‌ను స్టీవ్ జాబ్స్ లాంచ్ చేశారు. 2015, 2016లలో లాంచ్ చేసిన ఐ పాడ్, ఎయిర్‌ పాడ్స్, యాపిల్ వాచ్‌లే ట్రెండీగా మారాయి. టైమ్స్ పాట్రిక్ ల్యూకాస్ ఆస్టిన్ రాసిన మీడియా కథనం ప్రకారం.. 2010లో ఐపాడ్ రాకముందు టాబ్లెట్ కంప్యూటర్‌దే హవా. 

ల్యాప్ టాప్ వినియోగాన్ని తగ్గించి చాలామంది ట్యాబ్లెట్స్ కు మారిపోయారు. సైన్స్ ఫిక్షన్ లాంటి సినిమాలు చూసే ప్రేక్షకులకు ఫ్రెండ్లీగా మారిపోయింది. యాపిల్ ఐపాడ్ రావడంతో ఒక్కసారిగా ప్రపంచమంతా చూపు తిప్పుకుంది. ఐ ఫోన్లు వచ్చేంతకాలం ఈ హవా కొనసాగింది. పర్సనల్ కంప్యూటింగ్‌కు సహాయపడే విధంగా ఉన్న ఈ ఐ-ఫోన్లు మరో దశాబ్దాన్ని కూడా శాసించగలవు.

ఈ మీడియా కథనం ప్రకారం.. కొంతకాలానికి స్మార్ట్ వాచ్‌లు లాంచ్ చేసిన యాపిల్ ఓ స్టాండర్డ్ క్రియేట్ చేసింది. ఆయన అంచనాను బట్టి ఎయిర్‌పాడ్స్ వైర్ లెస్ ఆడియో అందించడంలో పూర్తిగా విజయవంతమైంది. యాపిల్ ప్రొడక్టులతో పాటు టెస్లా మోడల్ ఎస్, రాస్ప్ బెర్రీ పై, గూగుల్ క్రోమ్ క్యాస్ట్, డీజేఐ ఫాంటం, అమెజాన్ ఇకో, నిన్టెన్డో స్విచ్, ఎక్స్‌బాక్స్ అడాప్టివ్ కంట్రోలర్‌లు కూడా దశాబ్దంలో టాప్‌ స్థానం దక్కించుకున్న ఉత్పత్తులు.

ట్రెండింగ్ వార్తలు