iphone 13 Deal : ఐఫోన్ 14 వస్తోంది.. ఐఫోన్ 13పై ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో భారీ డిస్కౌంట్లు.. ఎందులో డీల్ బెటర్ అంటే?

iphone 13 Deal : ప్రముఖ ఐటీ దిగ్గజం Apple కొత్త iPhone 14 సిరీస్‌ను సెప్టెంబర్ 7న లాంచ్ చేయనుంది. ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ ఐఫోన్లలో iPhone 13 సిరీస్.. ఈ కామర్స్ దిగ్గజం Flipkartలో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అమెజాన్‌లో సగ ధరకే అందుబాటులో ఉంది.

iphone 13 Deal : ఐఫోన్ 14 వస్తోంది.. ఐఫోన్ 13పై ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో భారీ డిస్కౌంట్లు.. ఎందులో డీల్ బెటర్ అంటే?

iphone 13 Deal _ iPhone 13 on Amazon and Flipkart ahead of iPhone 14 launch, who's offering better deals

iphone 13 Deal : ప్రముఖ ఐటీ దిగ్గజం Apple కొత్త iPhone 14 సిరీస్‌ను సెప్టెంబర్ 7న లాంచ్ చేయనుంది. ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ ఐఫోన్లలో iPhone 13 సిరీస్.. ఈ కామర్స్ దిగ్గజం Flipkartలో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అమెజాన్‌లో సగ ధరకే అందుబాటులో ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ అమెజాన్ కన్నా ఆకర్షణీయమైన డీల్‌ అందిస్తోంది. ప్రస్తుతం, iPhone 13 బేస్ 128GB మోడల్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండింటిలోనూ రూ. 69,999కి అందుబాటులో ఉంది. కొన్ని సేల్, బ్యాంక్ డీల్‌లతో కలిపి, కస్టమర్‌లు ధర మరింత తగ్గించుకోవచ్చు.

Amazonలో iPhone 13 రూ. 14,900 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో అందుబాటులో ఉంది. అదే సమయంలో Amazonలో ఇతర బ్యాంక్ డీల్స్ అందుబాటులో లేవు. అయితే ఈ నెలాఖరులో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ షాపింగ్ ఫెస్టివల్ (Great Indian Festival Shopping festival) ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్లాట్‌ఫారమ్ అనేక ఆప్షన్లను అందిస్తోంది.

iphone 13 Deal _ iPhone 13 on Amazon and Flipkart ahead of iPhone 14 launch, who's offering better deals

iphone 13 Deal _ iPhone 13 on Amazon and Flipkart ahead of iPhone 14 launch

ఫ్లిప్‌కార్ట్‌లో, ఐఫోన్ 13 ఎక్స్ఛేంజ్ డీల్‌తో కూడా అందుబాటులో ఉంది. అంతేకాదు.. ప్లాట్‌ఫారమ్ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ Non-EMI లావాదేవీలపై రూ. 2,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ 13 బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఫ్లిప్‌కార్ట్‌లో మరింత డిస్కౌంట్ పొందవచ్చు. అయితే సెప్టెంబరు 23న ఈ సేల్ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు

ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఎక్స్ఛేంజ్ విలువ లభించదని కస్టమర్‌లు గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు.. ఏదైనా స్మార్ట్‌ఫోన్‌పై రూ. 14,000 వరకు ఎక్స్ఛేంజ్ విలువను అందిస్తే.. రూ. 10వేల వరకు మాత్రమే పొందే అవకాశం ఉంది. అది కూడా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్, దాని కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. Apple iPhoneలు సాధారణంగా అధిక ఎక్స్ఛేంజ్ వాల్యును కలిగి ఉంటాయి. Flipkartలో పాత iPhone 7ని ఎక్స్ఛేంజ్ చేస్తే.. ప్లాట్‌ఫారమ్ బెస్ట్ వాల్యూ రూ. 8,450ని అందించింది. ప్రైస్ ట్రాకర్ వంటి Chrome Extensions డౌన్‌లోడ్ చేయడం ద్వారా కస్టమర్‌లు ప్రొడక్ట్ ధరలను ట్రాక్ చేయవచ్చు.

iphone 13 Deal _ iPhone 13 on Amazon and Flipkart ahead of iPhone 14 launch, who's offering better deals

iphone 13 Deal _ iPhone 13 on Amazon and Flipkart ahead of iPhone 14 launch

రెండు ప్లాట్‌ఫారమ్‌ల్లో ఐఫోన్ 13 మోడల్‌పై అనేక కలర్ ఆప్షన్లలో అందిస్తున్నాయి. ఐఫోన్ 13 ఇప్పటికీ మార్కెట్లో అత్యంత ఆకర్షణీయమైన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా ఉంది. Apple A15 బయోనిక్ చిప్‌సెట్, డ్యూయల్ 12-MP కెమెరాలతో వస్తుంది. ముందు భాగంలో, మరొక 12-MP సెల్ఫీ కెమెరా ఉంది. ఐఫోన్ 13 ఇప్పటికీ ఛార్జింగ్ కోసం పోర్ట్‌ను కలిగి ఉంది. ఇక బాక్స్‌లో ఛార్జర్ అందించడం లేదు. ఫేస్ ID, 5G, 6.1-అంగుళాల OLED డిస్ప్లే, గ్లాస్ బ్యాక్ వంటి ఇతర ముఖ్య ఫీచర్లు ఉన్నాయి.

Read Also : iPhone 14 : ఐఫోన్ 13పై డిస్కౌంట్ ఇచ్చినా కొనొద్దు.. అదిరే ఫీచర్లతో చౌకైన ధరకే iPhone 14 వస్తోంది.. డోంట్ మిస్..!