iPhone 13 Price in India : ఇండియాలో భారీగా తగ్గిన ఐఫోన్ 13 ధర.. కొత్త ఐఫోన్ 14 కొనాలా? వద్దా? ఇందులో ఏది బెటర్ అంటే?

iPhone 13 Price in India : ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 Series) అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ 13 సిరీస్ కొనాల్సిన వినియోగదారులంతా ఐఫోన్ 14 సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు.

iPhone 13 Price in India : ఇండియాలో భారీగా తగ్గిన ఐఫోన్ 13 ధర.. కొత్త ఐఫోన్ 14 కొనాలా? వద్దా? ఇందులో ఏది బెటర్ అంటే?

iPhone 13 price in India drops after iPhone 14 launch, but should you buy it

iPhone 13 Price in India : ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 Series) అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ 13 సిరీస్ కొనాల్సిన వినియోగదారులంతా ఐఫోన్ 14 సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, ఐఫోన్ 14 సిరీస్ ఫీచర్లు కూడా ఐఫోన్ 13 మాదిరిగానే ఉంటాయని, కొత్త ఫీచర్లు పెద్దగా లేవని తెలిసి వినియోగదారుల్లో ఉత్సాహం కాస్తా తగ్గినట్టు కనిపిస్తోంది.  వినియోగదారుల్లో చాలామంది ఐఫోన్ 14 సిరీస్ కన్నా ఐఫోన్ 13 సిరీస్ బెటర్ అని భావిస్తున్నారు.

అందులోనూ ఐఫోన్ 13 సిరీస్ ధర కూడా భారీగా తగ్గడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. మరికొంతమంది వినియోగదారుల్లో ఇప్పటికీ ఒక ప్రశ్న వినిపిస్తోంది. iPhone 13 కొనాలా? లేదా iPhone 14 కొనుగోలు చేయాలా? అని గందరగోళానికి గురవుతున్నారు. ఐఫోన్ 13 సిరీస్ (iPhone 13 Series) భారీ ధర తగ్గింపుతో (దాదాపు రూ. 10,000 తగ్గింపు) అందుబాటులో ఉంది.

iPhone 13 price in India drops after iPhone 14 launch, but should you buy it

iPhone 13 price in India drops after iPhone 14 launch, but should you buy it

ప్రస్తుతం, iPhone 13 బేస్ 128GB వేరియంట్‌కు రూ. 69,900గా ఉంది. అదే స్టోరేజీ ఆప్షన్.. భారత మార్కెట్లో iPhone 14 ధర రూ.79,900 నుంచి ప్రారంభమవుతుంది. ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో ఐఫోన్ 13 సేల్స్ (iPhone 13 Sales) ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి. మీరు ఐఫోన్ 13ని MRP కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

iPhone 13, iPhone 14 సిరీస్ ఫోన్లలో ఎందులో ఏయే స్పెసిఫికేషన్‌లను ఉన్నాయో నిశితంగా పరిశీలించి.. ఏది కొనుగోలు చేయాలో నిర్ణయించుకోవచ్చు. iPhone 14, iphone 13 ఎక్కువ లేదా తక్కువ బరువు ఉంటాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 6.1-అంగుళాల స్క్రీన్‌తో వచ్చాయి. డివైజ్ వెనుకవైపు.. అదే 12-MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో వచ్చాయి. ఫ్రంట్ సైడ్‌లో 12-MP సెల్ఫీ కెమెరా ఉంది.

iPhone 13 price in India drops after iPhone 14 launch, but should you buy it

iPhone 13 price in India drops after iPhone 14 launch, but should you buy it

A15 బయోనిక్ చిప్‌సెట్‌తో ప్రాసెసర్‌ ఉండటంతో కొత్త iPhone 14 స్పీడ్‌గా పని చేస్తుంది. బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువగానే అందిస్తుంది. ఈ రెండు ఫోన్‌లు భారతీయ మార్కెట్లో ముఖ్యమైన అన్ని 5G బ్యాండ్‌లకు సపోర్టు అందిస్తాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్ల మధ్య ఒకే పెద్ద తేడా ఏంటంటే.. iPhone 14 మరిన్ని ఏళ్ల పాటు iOS అప్‌డేట్స్ పొందుతుంది. మరోమాటలో చెప్పాలంటే.. రూ. 80వేల పైనా బడ్జెట్ పెట్టేందుకు సిద్ధంగా ఉన్న వినియోగదారులు కొత్త iPhone 14 కొనుగోలు చేయవచ్చు. అదే ఐఫోన్ 13 కూడా 10 వేల తేడాతో అందుబాటులో ఉంది.

ఐఫోన్ 14 సిరీస్ కొనుగోలు చేస్తే.. అందులో పెద్దగా మార్పులేం లేవు. అందుకే ఐఫోన్ 13 సిరీస్ (iPhone 13 Series) కొనుగోలు చేయడమే బెటర్. డబ్బుకు డబ్బు ఆదా.. అదే ఫీచర్లు తక్కువ ధరలో వస్తున్నాయి. మరి.. ఇంకెందుకు కొత్త ఐఫోన్ 14 సిరీస్ కొనుగోలు చేయడం.. ఐఫోన్ 13 సిరీస్‌లోనూ అంతే ఫీచర్లు వస్తున్నాయి కదా.. కొత్త ఐఫోన్ 14 సిరీస్ కావాలా? లేదా ఐఫోన్ 13 సిరీస్ తక్కువ ధరకు కొనుగోలు చేస్తారా? అనేది మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

Read Also : iPhone 13 Price Drop : ఐఫోన్ 14 లాంచ్ ఈవెంట్.. ఆపిల్ ఐఫోన్ 13 ధర తగ్గిందోచ్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో చెక్ చేశారా?