iPhone 14 Plus Price In India : ఆపిల్ మినీ వెర్షన్ బదులుగా ఐఫోన్ 14 ప్లస్ మోడల్స్.. శాటిలైట్ OS ఫీచర్లు అదుర్స్.. ఇండియాలో ధర ఎంతో తెలుసా?

iPhone 14 Plus Price In India : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ న్యూ జనరేషన్ ఐఫోన్లను ప్రవేశపెట్టింది. ఆపిల్ ఫార్ అవుట్ (Apple Far Event) ఈవెంట్లో ఆపిల్ ఐఫోన్ 14 (iPhone 14, iPhone 14 Pro) మోడళ్లను లాంచ్ చేసింది.

iPhone 14 Plus Price In India : ఆపిల్ మినీ వెర్షన్ బదులుగా ఐఫోన్ 14 ప్లస్ మోడల్స్.. శాటిలైట్ OS ఫీచర్లు అదుర్స్.. ఇండియాలో ధర ఎంతో తెలుసా?

iPhone 14, iPhone 14 Plus and Pro models launched in India, price starts at Rs 79,900

iPhone 14 Plus Price In India : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ న్యూ జనరేషన్ ఐఫోన్లను ప్రవేశపెట్టింది. ఆపిల్ ఫార్ అవుట్ (Apple Far Event) ఈవెంట్లో ఆపిల్ ఐఫోన్ 14 (iPhone 14, iPhone 14 Pro) మోడళ్లను లాంచ్ చేసింది. గతేడాది మాదిరిగానే చిన్నపాటి మార్పులతో 4 న్యూ జనరేషన్ ఐఫోన్ ప్రో మోడళ్లను ఆపిల్ ఆవిష్కరించింది. ఆపిల్ అందించే సాధారణ లైనప్‌లో ఇప్పుడు మినీ వెర్షన్‌కు బదులుగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14, iPhone 14 Plus) అనే రెండు వేరియంట్‌లను రిలీజ్ చేసింది.

అయితే ఈ ఐఫోన్ ప్రో సిరీస్‌లో ఐఫోన్ 14 ప్రో (iPhone 14), ఐఫోన్ 14 ప్రో మాక్స్ (iPhone Pro Max) ఉన్నాయి. ఊహించినట్టుగానే.. Apple iPhone 14 Pro లైనప్‌లో కొన్ని బెస్ట్ ఫీచర్లను వదిలివేసింది. కానీ, సాధారణ మోడల్‌ iPhone 13 లైనప్‌లో మాత్రం చిన్నపాటి అప్‌గ్రేడ్‌లను అందించనుంది.

iPhone 14, iPhone 14 Plus and Pro models launched in India, price starts at Rs 79,900

iPhone 14, iPhone 14 Plus and Pro models launched in India, price starts at Rs 79,900

అందుకే ఐఫోన్ 14 సిరీస్ ధర (iPhone 14 Series Price) ఐఫోన్ 13 సిరీస్‌తో సమానంగా ఉంటుంది. అయితే iPhone Pro వేరియంట్‌లు మాత్రం చాలా ఖరీదైనవనే చెప్పాలి.  భారత మార్కెట్లో iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro మాక్స్ ప్రారంభ ధర ఎంత ఉంటాయో ఓసారి లుక్కేయండి.

Apple iPhone Models Price in India List :

* iPhone 14: రూ. 79,900 (128GB), రూ. 89,900 (256GB), రూ. 1,09,900 (512GB)
* iPhone 14 Plus : రూ. 89,900 (128GB), రూ. 99,900 (256GB, GB), రూ. 1,190 (1,519GB)
* iPhone 14 Pro : రూ. 1,29,900 (128GB), రూ. 1,39,900 (256GB), రూ. 1,59,900 (512GB), రూ. 1,79,900 (1TB)
* iPhone 14 Pro Max : రూ. 1,39,900 (128GB), 1,49,900 (256GB), రూ 1,69,900 (512GB), రూ 1,89,900 (1TB)

ఐఫోన్ 13 బేస్ 128GB స్టోరేజ్ ఆప్షన్ మోడల్ రూ.79,900 ప్రారంభ ధరతో వచ్చింది. అయితే 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్‌ల ధరలు వరుసగా రూ.89,900, రూ.1,09,900. ఐఫోన్ 13 Pro 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,19,900 ట్యాగ్‌తో వచ్చింది. అలాగే 256GB మోడల్ ధర రూ. 1,29,900గా ఉంది.

Read Also : iPhone 14 Pro Models in India : ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మోడల్స్ వచ్చేశాయి. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత? సేల్ డేట్ ఇదేనా? ఫుల్ లిస్ట్ మీకోసం..!

512GB స్టోరేజ్ ధర రూ. 1,49,900, 1TB మోడల్ ధర రూ. 1,69,900గా నిర్ణయించింది. చివరగా, iPhone 13 Pro Max నాలుగు వేరియంట్‌ల ధర రూ. 1,29,900 (128GB), 1,39,900 (256GB), రూ. 1,59,900 (512GB), రూ. 1,79,900 (1TB)గా ఉండనున్నాయి.

iPhone 14, iPhone 14 Plus and Pro models launched in India, price starts at Rs 79,900

iPhone 14, iPhone 14 Plus and Pro models launched in India, price starts at Rs 79,900

ఆపిల్ ఇండియా (Apple India) వెబ్‌సైట్ ట్రేడింగ్, EMI Payment Options కూడా అందిస్తోంది. ప్రీ-ఆర్డర్‌లు (Apple iphone Pre-Orders) సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమవుతాయి. iPhone 14 సేల్ సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభం కానుంది. ఆపిల్ ఐఫోన్ ప్లస్ (iPhone 14 Plus) వేరియంట్ సేల్ అక్టోబర్ 7 నుంచి అందుబాటులో ఉంటుంది. ఇక ఐఫోన్ ప్రో మోడల్స్ సెప్టెంబర్ 16 నుంచి సేల్ మొదలు కానుంది.

iPhone 14, iPhone 14 Plus స్పెసిఫికేషన్‌లు ఇవే :
కొత్త ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌ల మధ్య ముఖ్యమైన తేడా ఒక్కటే.. అదే ప్రాసెసర్.. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‌లు ఆపిల్ ఓల్డ్ జనరేషన్ A15 బయోనిక్ చిప్‌సెట్‌ను కలిగి ఉన్నాయి. ఇక ఐఫోన్ ప్రో మోడల్స్ A16 బయోనిక్ చిప్‌సెట్‌తో వచ్చాయి. ఐఫోన్ 14 ప్రో మోడల్‌లలో ఆపిల్ చివరకు పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌కు మారింది. చాలా ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఈ డిజైన్‌ ఉంటుంది. ఇప్పుడు ఐఫోన్‌లలో కూడా ఈ డిజైన్ వచ్చింది. దురదృష్టవశాత్తూ, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ మోడల్ iPhone 13 సిరీస్‌లో చూసిన ఓల్డ్ వైడ్ నాచ్ డిజైన్‌తో వచ్చాయి.

iPhone 14 Pro and iPhone 14 Pro Max launched in India _ Top specs, price, sale date and other details

iPhone 14, iPhone 14 Plus and Pro models launched in India, price starts at Rs 79,900

ఈ డివైజ్‌లు మిడ్ నైట్, స్టార్‌లైట్, బ్లూ, పర్పల్, ప్రొడక్ట్ రెడ్ (midnight, starlight, blue, purple, product red) ఐదు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో పెద్ద స్క్రీన్, బ్యాటరీని కోరుకునే యూజర్లకు ఈ కొత్త ఐఫోన్ 14 ప్లస్ వేరియంట్‌ బెస్ట్ అని చెప్పవచ్చు. ఐఫోన్ 14 6.1-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. అయితే ప్లస్ వెర్షన్ 6.7-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. మీరు ఐఫోన్ ప్రో మాక్స్‌లోనూ ఇలానే ఉంటాయి. 1-200నిట్స్ బ్రైట్‌నెస్ లైట్, డాల్బీ విజన్‌కు సపోర్టుతో OLED స్క్రీన్‌ను కలిగి ఉంటాయి. ఈ రెండు ఐఫోన్‌లు A15 బయోనిక్ చిప్‌తో వచ్చాయి. ఇది గత ఏడాది మోడల్‌లలో ఇదే ఉంది. ఈ రెండు ఫోన్‌లలో వెనుకవైపు ఒకే డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందిస్తోంది. కానీ, పెద్ద సెన్సార్, 1.9మైక్రాన్ పిక్సెల్‌లతో కొత్త 12-MP ప్రధాన కెమెరాతో వచ్చాయి. OISకి సపోర్టు చేస్తుంది. పాత మోడళ్లతో పోలిస్తే 49 శాతం మెరుగుదల అందిస్తాయని ఆపిల్ పేర్కొంది. తక్కువ-కాంతిలోనూ ఫోటోలను తీసేందుకు మెరుగైన ఇమేజ్ ప్రాసెసింగ్ కొత్త ఫోటోనిక్ ఇంజిన్ కూడా ఉంది.

iPhone 14 Pro and iPhone 14 Pro Max launched in India _ Top specs, price, sale date and other details

iPhone 14, iPhone 14 Plus and Pro models launched in India, price starts at Rs 79,900

కంపెనీ ప్రకారం.. నైట్-మోడ్ ఎక్స్‌పోజర్ ఇప్పుడు రెండు రెట్లు వేగంగా పనిచేస్తోంది. ఫ్రంట్ సైడ్ కూడా 12-MP కెమెరా అందించింది. ఇప్పుడు ట్రూడెప్త్ కెమెరాతో కూడిన హైబ్రిడ్ సిస్టమ్‌కు సపోర్టును అందిస్తుంది. తక్కువ వెలుతురులో కూడా వేగంగా ఫోకస్ చేసేందుకు సాయపడుతుంది. వీడియోల కోసం ఓవర్‌స్కాన్, రోల్ కరెక్షన్‌తో పూర్తి సెన్సార్‌ కొత్త వీడియో యాక్షన్ మోడ్ అందిస్తోంది. ఐఫోన్ 14 క్రాష్ డిటెక్షన్ కలిగి ఉంది.

iPhone 14, iPhone 14 Plus and Pro models launched in India, price starts at Rs 79,900

iPhone 14, iPhone 14 Plus and Pro models launched in India, price starts at Rs 79,900

శాటిలైట్ కనెక్టివిటీ వంటి ఫీచర్లతో వస్తుంది. రెండోది నెట్‌వర్క్ లేని ప్రదేశాలలో కూడా కమ్యూనికేట్ చేసేందుకు అద్భుతంగా సాయపడుతుంది. మీ ఐఫోన్ ఆటోమాటిక్‌గా శాటిలైట్‌ను డిటెక్ట్ చేస్తుంది. మీ ఐఫోన్ కనెక్షన్‌ ద్వారా లొకేషన్‌ను షేర్ చేయవచ్చు. Apple ఈ ఫీచర్‌ని ‘Emergency SOS via Satellite’ అని పిలుస్తోంది. Apple ఈ ఫీచర్‌ని ఉచితంగా అందిస్తోంది. కానీ iPhone 14తో కేవలం 2 ఏళ్లు మాత్రమే పనిచేస్తుంది. మొదట అమెరికా, కెనడా వంటి దేశాల్లో అందుబాటులో ఉంటుంది. వచ్చే నవంబర్‌లో ఇతర ప్రాంతాలలోనూ అందుబాటులోకి రానుంది.

Read Also : Apple iPhones : భారతీయుల ఐఫోన్లు 80శాతం ఛార్జింగ్‌తోనే ఆగిపోతున్నాయి.. అసలు కారణం ఇదే!