iPhone 14 Pro Charging : సెప్టెంబర్ 7న ఆపిల్ ఐఫోన్ 14 ప్రో వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఛార్జింగ్ వివరాలు లీక్..!

iPhone 14 Pro Charging : ప్రముఖ ఆపిల్ దిగ్గజం ఐఫోన్ నుంచి కొత్త మోడల్ రాబోతోంది. అదే.. ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro) స్మార్ట్‌ఫోన్. ఈ కొత్త ఐఫోన్ మోడల్ (iPhone 14 Series) వచ్చే వారం భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది.

iPhone 14 Pro Charging : సెప్టెంబర్ 7న ఆపిల్ ఐఫోన్ 14 ప్రో వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఛార్జింగ్ వివరాలు లీక్..!

iPhone 14 Pro charging details tipped ahead of September 7 launch

iPhone 14 Pro Charging : ప్రముఖ ఆపిల్ దిగ్గజం ఐఫోన్ నుంచి కొత్త మోడల్ రాబోతోంది. అదే.. ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro) స్మార్ట్‌ఫోన్. ఈ కొత్త ఐఫోన్ మోడల్ (iPhone 14 Series) వచ్చే వారం భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. వర్చువల్ లాంచ్ ఈవెంట్ ద్వారా సెప్టెంబర్ 7న iPhone 14 Pro స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్లోకి లాంచ్ కానుంది. కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం iPhone 14, iPhone 14 Max, iPhone 14 Proతో పాటు iPhone 14 Pro Max మొత్తం 4 కొత్త మోడళ్లను లాంచ్ చేయనుంది. అధికారిక లాంచ్‌కు వారానికి ముందే ఐఫోన్ 14Pro మోడల్ కొత్త వివరాలు నెట్టింట్లో లీకయ్యాయి.

DuanRui లీక్‌స్టర్ ప్రకారం.. iPhone 14 Pro బాక్స్ వెలుపల 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానుంది. ఐఫోన్‌లు, యాపిల్ ప్రొడక్టులకు సంబంధించిన అప్‌డేట్‌లను ఎక్కువగా టిప్‌స్టర్ ట్రాకింగ్ చేస్తుంటుంది. ఐఫోన్ 14 Pro స్పీడ్ ఛార్జింగ్‌ వివరాలను కూడా టిప్ స్టార్ రివీల్ చేసింది. ఛార్జర్ బ్రాండ్ కొత్త 30W ఛార్జర్‌ను అందించనుందని తెలిపింది.

iPhone 14 Pro charging details tipped ahead of September 7 launch

iPhone 14 Pro charging details tipped ahead of September 7 launch

ఆపిల్ ఈ ఏడాదిలో 30W GaN ఛార్జర్‌ను అందించనుంది. ఐఫోన్ 14Pro 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రావడం ఇదే మొదటిసారి కాదు. ఐఫోన్ 14Pro, ఐఫోన్ 14Pro Max స్మార్ట్ ఫోన్లకు వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. ఈ ప్రో మోడల్‌లకు మాత్రమే పరిమితం చేసే అవకాశం ఉంది. ఈసారి మొత్తం iPhone 14 లైనప్ ఎప్పటిలాగే అదే పోర్ట్‌తో వస్తుందని భావిస్తున్నారు. EU రాబోయే ఏళ్లల్లో మార్కెట్లో ఉపయోగించే USB టైప్ Cని సాధారణ ఛార్జర్‌గా అందించనుంది.

మరోవైపు.. భారత్ కూడా మల్టీ ఛార్జ్ విధానంపై పనిచేస్తోంది. Apple వంటి బ్రాండ్‌లకు కూడా సాధారణ ఛార్జింగ్ అందించే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. Apple ఫార్ అవుట్ ఈవెంట్ సెప్టెంబర్ 7న Apple Parkలో జరుగనుంది. ఈ సందర్భంగా నాలుగు కొత్త ఐఫోన్ (Four New iPhone models) మోడళ్లతో పాటు, కంపెనీ కొత్త ఐప్యాడ్‌లు, కొత్త ఎయిర్‌పాడ్‌లు, కొత్త ఆపిల్ వాచ్ సిరీస్ (Apple Watch Series) వంటి మరెన్నో ప్రొడక్టులను లాంచ్ చేయనుంది.

Read Also : iPhone 14 Pro Design Leaked : లాంచ్‌కు ముందే ఆపిల్ 14ప్రో డిజైన్ లీక్.. రాబోయే ఐఫోన్‌‌ 14 గురించి ఈ 5 విషయాలు తెలుసా?