iPhone 15 Ultra Model : ఆపిల్ ఐఫోన్ 15 అల్ట్రా మోడల్‌ వస్తోంది.. ఐఫోన్ 14 మించి ఫీచర్లు ఉంటాయట.. లాంచ్ ఎప్పుడో తెలుసా?

iPhone 15 Ultra Model : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఇటీవలే ఐఫోన్ 14 సిరీస్‌ (iPhone 14 Series)ను ప్రవేశపెట్టింది. ఐఫోన్ 14 సిరీస్‌లో మొత్తం నాలుగు మోడళ్ల (iPhone 14, iPhone 14 Pro, iPhone 14 Pro Max, iPhone 14 Plus)ను గ్లోబల్ మార్కెట్లో ప్రవేశపెట్టింది.

iPhone 15 Ultra Model : ఆపిల్ ఐఫోన్ 15 అల్ట్రా మోడల్‌ వస్తోంది.. ఐఫోన్ 14 మించి ఫీచర్లు ఉంటాయట.. లాంచ్ ఎప్పుడో తెలుసా?

Apple could introduce iPhone 15 Ultra model next years

iPhone 15 Ultra Model : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఇటీవలే ఐఫోన్ 14 సిరీస్‌ (iPhone 14 Series)ను ప్రవేశపెట్టింది. ఐఫోన్ 14 సిరీస్‌లో మొత్తం నాలుగు మోడళ్ల (iPhone 14, iPhone 14 Pro, iPhone 14 Pro Max, iPhone 14 Plus)ను గ్లోబల్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. సరిగ్గా వారం తర్వాత.. నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్‌లపై ఆన్‌లైన్‌లో రుమర్లు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఆపిల్ విశ్లేషకులు మింగ్ చి కువో, మార్క్ గుర్మాన్ (Ming Chi Kuo, Mark Gurman) కూడా రాబోయే ఐఫోన్‌లకు సంబంధించి అనేక ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.

ఐఫోన్ 15 సిరీస్‌ (iPhone 15 Series)తో ఎక్కువ మంది కస్టమర్‌లను ఆకర్షించేందుకు ఆపిల్ కొన్ని ముఖ్యమైన మార్పులను చేస్తుందని భావిస్తున్నారు. అందులో ముఖ్యంగా Pro Max వేరియంట్‌కు పేరు మార్చాలని కూడా భావిస్తున్నారని నివేదిక తెలిపింది. గ్లోబల్ మార్కెట్‌లో ఆపిల్ తమ సేల్స్ పెంచడానికి Apple iPhone 15 సిరీస్‌తో రెగ్యులర్, Pro మోడల్‌లను తీసుకురానుందని Kuo స్పష్టం చేశారు. కంపెనీ స్టాండర్డ్, Pro Models మధ్య చాలా తేడా ఉంటుందని అంటున్నారు. ఆపిల్ ఐఫోన్ యూజర్లకు హై-ఎండ్ ఫోన్‌లపై ఆసక్తిని పెంచేలా చేస్తుందని అభిప్రాయపడ్డారు. వాస్తవానికి ఈ ఏడాదిలో లైనప్ కోసం Apple ప్రయత్నించగా అనివార్య కారణాల రీత్యా వచ్చే ఏడాదికి ప్లాన్ చేస్తున్నట్టు నివేదిక అంచనా వేసింది.

Apple could introduce iPhone 15 Ultra model next year

Apple could introduce iPhone 15 Ultra model next year

ఐఫోన్ 14 (iPhone 14), ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro) మోడల్‌ల మధ్య చాలా తేడాలు ఉన్నాయి. డివైజ్‌లో చిప్‌సెట్ నుంచి కెమెరా వరకు, అధిక పర్ఫార్మెన్స్ కోరుకునే యూజర్ల కోసం Pro Models ఎంచుకునేలా Apple అనే మార్పులు చేస్తోంది. అందులో భాగంగానే ఆపిల్ అనేక పెనుమార్పులు తీసుకురావాలని యోచిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. అదేగానీ జరిగితే.. ఆపిల్ ఐఫోన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో ఆపిల్ ఐఫోన్ 14 (Apple iPhone 14 Series) ను అదే పాత ధరలకే అందుబాటులోకి తీసుకొచ్చింది.

అయితే ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro) ఐఫోన్ ప్రో మాక్స్ (iPhone 14 Pro Max) ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఆపిల్ ప్రో మాక్స్ (Apple Pro Max) మోడల్‌కు పేరు మార్చడానికి ప్రణాళికలు వేస్తోందని భావిస్తున్నారు. అయితే దీన్ని ‘Ultra’ అని పిలిచే అవకాశం ఉందని గుర్మాన్ వెల్లడించారు. ఆపిల్ ఇప్పటికే హై-ఎండ్ వాచ్‌ (High-End Watch)ను అల్ట్రా (Ultra Watch)గా అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేమాదిరిగా Mac M-Series కూడా Pro, Max, Ultra వేరియంట్‌లను కలిగి ఉంది.

Apple could introduce iPhone 15 Ultra model next year

Apple could introduce iPhone 15 Ultra model next year

ఐఫోన్ 15 సిరీస్‌ (iPhone 15 Series)కు సంబంధించి ఇతర నిర్దిష్ట వివరాలు రివీల్ చేయలేదు. కానీ, ఐఫోన్ 14 సిరీస్ మోడళ్ల కన్నా హైఎండ్ ఫీచర్లు ఉంటాయని నివేదికలు భావిస్తున్నాయి. రాబోయే నెలల్లో iPhone 15 Ultra Model గురించి మరింత సమాచారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో ఐఫోన్ 14 మోడల్ ఐఫోన్ 13 సిరీస్‌తో సమానంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. సేల్స్ పరంగా ఆపిల్ కొత్త మోడల్ కన్నా చాలా చౌకగా ఉండటంతో ఎక్కువగా iPhone 13ని కొనుగోలు చేసేందుకు యూజర్లు ఆసక్తి చూపిస్తున్నారు. Apple కొత్త iPhone 14, iPhone Plus మోడల్‌లు iPhone 13 mini కన్నా తక్కువ ప్రీ-ఆర్డర్‌లు వచ్చాయని నివేదిక పేర్కొంది.

Read Also : iPhone 14 Price in India : కొత్త ఐఫోన్ 14 సిరీస్ అతి తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.. కానీ, ఈ కండిషన్లకు ఒప్పుకుంటేనే..!