బంగారం మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి సమయమిదేనా..

  • Published By: Subhan ,Published On : May 20, 2020 / 11:29 AM IST
బంగారం మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి సమయమిదేనా..

ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లు పెట్టుబడులను మారుస్తున్నారు. రిస్క్ ఫ్రీ ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. అనిశ్చితి నెలకొన్న సమయంలో ప్రభుత్వ బాండ్లు, బంగారం వంటి వాటిని కొనుగోలు చేయడమే శ్రేయస్కరం. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులు.. కరోనా వైరస్ మహమ్మారి ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తున్న తరుణంలో స్థిరాస్థుల మీదే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు. సాధారణంగా ఇండియాలో ఫిజికల్ గోల్డ్ కొనడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. 

10గ్రాములకు రూ. 43 నుంచి 47వేలు పలుకుతున్న బంగారం ప్పటికే 16శాతం ధర పెరిగింది.  అంత ఖరీదైన మెటల్ మీద పెట్టుబడులు పెట్టడం సేఫేనా? మరి బంగారం కొనుగోలు చేయడానికి ఎంత వరకూ కరెక్ట్ రేట్? ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడులకు ఏది సరైన పద్ధతి?

బంగారంపై పెట్టుబడులు పెట్టొచ్చా:
సంపదను మెరుగుపరచుకునే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఈ చిన్నపాటి ధర పెరగడం, తగ్గడం పెద్ద ప్రభావం చూపించవు. ఆక్స్‌ఫర్డ్ ఎకానమిక్స్ రీసెర్చ్ ప్రకారం.. బంగారంలో హెచ్చుతగ్గులు సర్వసాధారణం. ఎకానమీలో ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉన్నప్పుడు ద్రవ్యోల్బణంలో మార్పులు సహజం.

ఏది సరైన పద్ధతి:
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్ 2020 మార్చి 24 ప్రకారం.. 1973 తర్వాత బంగారం యావరేజ్ రిటర్న్ 14.10 శాతంగా ఉంది ఇప్పుడు మాత్రమే. 21 ఏప్రిల్ 2020 నాటికి రూపాయి విలువ లైఫ్ టైంలో రూ.77పెరిగి బెస్ట్ అనిపించుకుంది. రాబోయే రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తాత్కాలికంగా బంగారం గనులు మూసి వేసి ఉంచడం కూడా ధరలు పెరగడంలో ఓ కారణమే. 

గోల్డ్ మీద పెట్టుబడులు పెట్టాలంటే.. ETF లేదా Gold గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన Sovereign Bonds పై పెట్టుబడులు పెట్టుకోవడానికి ఇది సరైన సమయం. పైగా అవి స్టాక్ ఎక్స్‌ఛేంజ్ లో అమ్ముకోవచ్చు కూడా. ఇలా చేయడం ద్వారా లిక్విడిటీ సమస్యలు ఉండవు. మున్ముందు టీసీఎస్ తో పాటు ఇతర బాండ్లు కొనుగోలు చేయడం వల్ల పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. కానీ, ఫిజికల్ గోల్డ్ కొనేటప్పుడు ఇవన్నీ తప్పనిసరిగా చెల్లించాలి. పెట్టుబడులు పెట్టదలిస్తే ఈటీఎఫ్, సొవరీన్ గోల్డ్ బాండ్స్ వైపు మొగ్గు చూపడం బెటర్. 

Read: రూ.50 వేలకు చేరువలో బంగారం ?