జెట్ CEO,CFO రాజీనామా

జెట్ CEO,CFO రాజీనామా

జెట్ ఎయిర్ వేస్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO),చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(CFO) అమిత్ అగర్వాల్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన రాజీనామా చేశారని మంగళవారం(మే-14,2019) జెట్ తెలిపింది.సోమవారం నుంచే ఆయన రాజీనామా అమల్లోకి వచ్చినట్లు ఎయిర్ లైన్స్ తెలిపింది.

తీవ్ర ఆర్థిక నష్టాలలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ సర్వీసులను ఇప్పటికే తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.గడిచిన నెల రోజులుగా ఎక్కువమంది జెట్ బోర్డు సభ్యులు ఒక్కొక్కరిగా తప్పుకుంటున్న విషయం తెలిసిందే.ఏప్రిల్-23,2019న వ్యక్తిగత కారణాలతో డైరక్టర్ గౌరాంగ్ శెట్టి బోర్డు నుంచి తప్పుకున్నారు.జెట్ ఫౌండర్ నరేష్ గోయల్,ఆయన భార్య అనితా గోయల్ కూడా బోర్డు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.