జెట్ ఎయిర్‌వేస్ సీఈఓ రాజీనామా.. SBIకి రూ.8400కోట్ల అప్పు

  • Published By: vamsi ,Published On : May 14, 2019 / 01:05 PM IST
జెట్ ఎయిర్‌వేస్ సీఈఓ రాజీనామా.. SBIకి రూ.8400కోట్ల అప్పు

జెట్ ఎయిర్‌వేస్ సీఎఫ్ఓ అమిత్ అగర్వాల్ రాజీనామా చేసి గంటలు గడవకముందే కంపెనీకి సీఈఓ వినయ్ దుబే కూడా సంస్థకు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని జెట్ ఎయిర్‌వేస్ సంస్థ మంగళవారం(14 మే 2019) ఓ ప్రకటనలో వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతోనే వీరిద్దరూ రాజీనామా చేశారని, వారి రాజీనామా వెంటనే అమల్లోకి వచ్చిందని సంస్థ తెలిపింది.

జెట్ ఎయిర్‌వేస్ సంస్థ 2019 ఏప్రిల్ 17 నుంచి ఎటువంటి ఆపరేషన్స్‌ను కూడా కొనసాగించని సంగతి తెలిసిందే. క్రూడ్ ఆయిల్ ధరల్లో ఆటుపోట్లు, ఆకర్షణీయమైన తక్కువ చార్జీలకే కొన్ని ఎయిర్‌లైన్స్ నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీ, రూపాయి బలహీనపడటం వంటి కారణాలతో జెట్ ఎయిర్‌వేస్ తీవ్ర నష్టాల భారిన పడింది.

లిక్విడిటీ సంక్షోభంతో జెట్ ఎయిర్‌వేస్ ఆపరేషన్లు తాత్కాలికంగా నిలిపివేయడంతో చాలా మంది సిబ్బంది గత నెలలోనే సంస్థను వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే సీఎఫ్ఓ, సీఈఓ కూడా సంస్థకు గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే జెట్ ఎయిర్‌వేస్ సంస్థ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.8400కోట్ల అప్పుపడి ఉంది.