సంక్షోభంలో Jet Airways : 13 విమానాల నిలిపివేత

  • Published By: madhu ,Published On : March 23, 2019 / 09:13 AM IST
సంక్షోభంలో Jet Airways : 13 విమానాల నిలిపివేత

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రైవేట్‌ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ తాజాగా 13 అంత‌ర్జాతీయ రూట్ల‌లో  విమానాల‌ను నిలిపివేసింది. ఏప్రిల్ నెల చివ‌ర వ‌ర‌కు ఇది వ‌ర్తిస్తుంద‌ని ఆ సంస్థ స్పష్టం చేసింది. దీంతో మొత్తం జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన 54 విమానాలు శాశ్వ‌తంగా గ్రౌండ్ అయ్యాయి. ఢిల్లీ, ముంబై నుంచి విదేశాల‌కు వెళ్లే జెట్ ఎయిర్‌వేస్ విమానాల‌ను పూర్తిగా ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఆ సంస్థ ప్రకటించింది.
Read Also : ఓటుకు నోటు పంచుతామని వచ్చి గొలుసు కొట్టేశారు‌

పుణె టు సింగ‌పూర్‌, పుణె టు అబుదాబి విమానాల‌ను ర‌ద్దు చేశారు. ముంబై నుంచి మాంచెస్ట‌ర్ వెళ్లే స‌ర్వీసుల‌ను ఇప్ప‌టికే నిలిపేశారు. సంస్థకు చెందిన పైలట్లు.. ప్రధాని మోడీ…పౌర విమానయానశాఖ మంత్రి సురేశ్ ప్రభుకు లేఖలు రాశారు. తమకు జీతాలు ఇప్పించాలని ఆ లేఖలో కోరారు. 
Read Also : ట్రంప్ చర్యలతో చెదురుతున్న డాలర్ డ్రీమ్స్ : ఆందోళనలో భారతీయులు‌