జియో హవా: అగ్రస్ధానంలో జియో

మొబైల్ టెలికం రంగంలో జియో తన హవా కొనసాగిస్తూనే ఉంది. గతేడాది నవంబర్ లో జియో లొ కొత్తగా 88.01 లక్షలమంది వినియోగదారులు చేరారు.

  • Published By: chvmurthy ,Published On : January 20, 2019 / 04:35 AM IST
జియో హవా: అగ్రస్ధానంలో జియో

మొబైల్ టెలికం రంగంలో జియో తన హవా కొనసాగిస్తూనే ఉంది. గతేడాది నవంబర్ లో జియో లొ కొత్తగా 88.01 లక్షలమంది వినియోగదారులు చేరారు.

ఢిల్లీ: టెలికాం రంగంలో  విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి ఉచితంగా డేటాను అందించింది జియో నెట్వర్క్.  తర్వాత కాలంలో  తక్కువ ధరకు డేటాను అందిస్తూ  వినియోగాదరులను ఆకర్షిస్తున్న జియో టెలికం రంగంలో తన హవా కొనసాగిస్తూనే ఉంది. జియో ధాటికి మిగిలిన టెలికం కంపెనీలు తమ వినియోగదారలను కోల్పోపోవటంతో ఆ కంపెనీలు ధరలు తగ్గించక తప్పలేదు.  నవంబర్ 2018 లో జియోకు 88.01 లక్షల మంది కొత్త  చందాదారులు  చేరారు. దీంతో మొత్తంగా జియో  నెట్ వర్క్ లో 27.17 లక్షలమంది చందాదారులు ఉన్నట్లు ట్రాయ్ తెలిపింది.  
గతేడాది కాలంగా జియో అగ్రస్ధానంలో  కొనసాగుతోంది. డిసెంబర్ 2018 లో డౌన్ లోడ్ స్పీడ్ తగ్గించినప్పటికీ జియో  అగ్రస్ధానంలోనే ఉందని ట్రాయ్ తెలిపింది. ట్రాయ్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో అదనంగా చందాదారులు  పొందటంలో జియో మొదటి స్ధానంలో ఉండగా,  ప్రభుత్వరంగ బీఎస్ ఎన్ఎల్ రెండవస్ధానం పొందింది. 2018 నవంబర్ చివరికి వివిధ టెలికం కంపెనీల్లో ఉన్న మొబైల్ వినియోగదారుల సంఖ్య 117.18 లక్షలుగా ఉంది.    ఇక బీఎస్ఎన్ఎల్ కు 3.78 లక్షల మంది , భారతీ ఎయిర్ టెల్ కు 1.02లక్షల మంది కొత్త  చందాదారులు వచ్చి చేరారు.