Jio Plans Hike : జియో యూజర్లకు మరో షాక్.. ఆ ప్లాన్ల ధరలు కూడా పెరిగాయి!

ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో తమ యూజర్లకు మరోసారి షాకిచ్చింది. ఇటీవలే ప్రీపెయిడ్ టారిఫ్ ధరలను పెంచిన జియో.. కొన్ని ప్లాన్లను సవరించింది.

Jio Plans Hike : జియో యూజర్లకు మరో షాక్.. ఆ ప్లాన్ల ధరలు కూడా పెరిగాయి!

Reliance Jio : ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో తమ యూజర్లకు మరోసారి షాకిచ్చింది. ఇటీవలే ప్రీపెయిడ్ టారిఫ్ ధరలను పెంచిన జియో.. కొన్ని ప్లాన్లను సవరించింది.. అంతేకాదు.. సవరించిన ప్లాన్లపై 20శాతం డిస్కౌంట్ కూడా ఆఫర్ చేసింది. చివరికి ఇప్పుడు.. డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్ర్కిప్షన్ బండిల్డ్ ప్లాన్ల ధరలను కూడా పెంచేసింది. మొన్నటివరకూ ఈ ప్రీపెయిడ్ ప్లాన్ల ప్రారంభ ధర రూ.499కే అందించేది. ఇప్పుడా ఆ ప్లాన్ల ధరలను రూ.601కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. యూజర్లపై దాదాపు మరో 20శాతం అదనపు భారం పడినట్టే.

మొన్నటివరకు ఈ ప్లాన్‌ ధర రూ.499 మాత్రమే. ఈ ప్లాన్‌ ధరను జియో రూ.601కి పెంచింది. ఇందులో Disney+ Hotstar Mobile ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ కూడా అందిస్తోంది. 3GB హైస్పీడ్‌ డేటాతో 28 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. అలాగే 6GB హైస్పీడ్‌ డేటాను అదనంగా ఆఫర్ చేస్తోంది. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 100 SMSలను అందిస్తోంది. మరో జియో ప్రీపెయిడ్ ప్లాన్ రూ.666కి ధరను రూ.799 వరకు పెంచింది. ఇందులో కూడా డిస్నీ+ హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ అందిస్తోంది. 56 రోజుల వ్యాలిడిటీపై రోజుకు 2GB డేటాను పొందవచ్చు.

ఇతర జియో ప్లాన్లలో రూ.888, రూ.1,066 ప్రీపెయిడ్ ప్లానను కూడా రివైజ్ చేసింది. ఈ రెండు ప్లాన్లలో రోజుకు 2GB డేటా, 5GB అదనపు డేటాను పెంచారు. వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లలో రూ.2,599 ప్లాన్‌, రూ.3,119లను కూడా జియో రివైజ్ చేసింది. 365 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటా, 10GB అదనపు డేటాను పెంచింది. రూ.549 ఉన్న ప్రీపెయిడ్ ధరను రూ.659కి పెంచింది. 56 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ 1.5GB రోజువారీ డేటాను అందిస్తోంది. వాస్తవానికి గత ఆగస్టు నెలలోనే Disney+ Hotstar Mobile ప్రీపెయిడ్ ప్లాన్లను రిలయన్స్ జియో ప్రవేశపెట్టింది.

Read Also : Apple Electric Car 3D Model : ఆపిల్ ఎలక్ట్రిక్ 3D కారు మోడల్ చూశారా? డిజైన్ అదిరిందిగా!