క్షణాల్లో బీర్ రెడీ : కింగ్ ఫిషర్ బీర్ మిక్స్ పౌడర్ వచ్చేసింది 

ఒకవైపు మండే ఎండలు.. ఒళ్లు వేడిక్కిపోతోంది. నాలుక పీక్కుపోతోంది. ఈ సమయంలో చేతిలో చల్లటి బీర్ బాటిల్ ఉంటే బాగుండు అనుకుంటున్నారా?

  • Published By: sreehari ,Published On : March 31, 2019 / 12:40 PM IST
క్షణాల్లో బీర్ రెడీ : కింగ్ ఫిషర్ బీర్ మిక్స్ పౌడర్ వచ్చేసింది 

ఒకవైపు మండే ఎండలు.. ఒళ్లు వేడిక్కిపోతోంది. నాలుక పీక్కుపోతోంది. ఈ సమయంలో చేతిలో చల్లటి బీర్ బాటిల్ ఉంటే బాగుండు అనుకుంటున్నారా?

ఒకవైపు మండే ఎండలు.. ఒళ్లు వేడిక్కిపోతోంది. నాలుక పీక్కుపోతోంది. ఈ సమయంలో చేతిలో చల్లటి బీర్ బాటిల్ ఉంటే బాగుండు అనుకుంటున్నారా? చల్లటి బీర్ తాగాలంటే బీర్ సీసాలను ఫ్రీజుల్లో స్టోర్ చేయాలి. పార్టీ చేసుకున్నా.. ఫంక్షన్ చేసినా.. బంధువులు, స్నేహితులకు క్షణాల్లో బీర్ సప్లయ్ చేయాలంటే.. బీర్ కేసెస్ కావాలి. బీర్ షాపులనుంచి ఆర్డర్ చేసిన బీర్ బాటిళ్లు ఇంటికి తీసుకెళ్లాలన్నా టైం వెస్ట్ . డోంట్ వర్రీ.. బీర్ లవర్స్ కు గుడ్ న్యూస్.
Read Also : రీఛార్జ్ చేసుకోండి : జియో.. బెస్ట్ 4G Data ప్లాన్స్ ఇవే

ఇకపై కిక్కించే బీర్  కోసం బార్ కు వెళ్లాల్సిన పనిలేదు. బీర్ షాపుల కోసం తిరగక్కర్లేదు. బీర్ బాటిళ్లు, బీర్ కేసులు ఫ్రీజ్ లో స్టోర్ చేయక్కర్లేదు. ఉన్నచోటే బీర్ తయారుచేసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత బీర్ తయారుచేసుకుని తాగేయొచ్చు. స్ట్రాంగ్ బీర్ కావాలా? లైట్ బీర్ కావాలా? లిటిల్ బీర్.. కావాలా? ఎలా కావాలంటే అంత మొత్తంలో పౌడర్ కలిపి తయారుచేసుకోవడం తాగేయడమే.

ఇన్ స్టంట్ బీర్ పౌడర్ ప్యాకెట్లు : 
అదేలా అనుకుంటున్నారా? మీ బీర్ దాహాన్ని తీర్చేందుకు ఇదిగో వచ్చేసింది.. కింగ్ ఫిషర్ (Instant Beer Powder Mix) బీర్ పౌడర్ మిక్స్.. అవును.. మీరు చదివింది నిజమే.. ఇండియా లీడింగ్ బీర్ బ్రాండ్.. కింగ్ ఫిషర్ ఇన్ స్టంట్ బీర్ ప్యాకెట్లు వచ్చేశాయ్.  యూనైటెడ్ బ్రివరీస్ గ్రూప్ సంస్థ Kingfisher Beer .. కింగ్ ఫిషర్ ఇన్ స్టంట్ బీర్ ను లాంచ్ చేసింది. ఫ్రీజ్ డ్రైయింగ్ టెక్నాలజీతో బీర్ సాచెట్స్ పౌడర్ ను ఇండియన్ కస్టమర్ల కోసం రిలీజ్ చేసింది. కింగ్ ఫిషర్ బీర్ ఉండగా.. టెన్షన్ ఎందుకు దండగ.. ఏప్రిల్ ఒకటి నుంచి పూర్తిగా ఈ బీర్ మిక్స్ పౌడర్ ప్యాకెట్లు అందుబాటులోకి రానున్నాయి.

బీర్ తయారీ ఎంతో ఈజీ.. 
బీర్ పౌడర్ మిక్స్.. వీటినే బీర్ సాచెట్స్ అని పిలుస్తారు. ఇంతకీ ఈ బీర్ పౌడర్ తో బీరు తయారు చేయడం ఎలా అని ఆలోచిస్తున్నారా? బీర్ తయారు చేయడం ఎంతో ఈజీ.. బీర్ సాచెట్స్ , వాటర్ ఉంటే చాలు.. క్షణాల్లో బీర్ రెడీ.. మీ దగ్గర బకెట్ ఉన్నా సరే.. లేదంటే.. మినరల్ వాటర్ డబ్బా ఉన్నా సరే.. ఒకేసారి బీర్ పౌడర్ కలిపి బీర్ తయారు చేసుకోవచ్చు. పార్టీలు చేసుకున్నా.. ఎక్కడికి వెళ్లినా.. నురుగలు కక్కే టెస్టీ బీర్ ను ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే బీర్ పౌడర్ ప్యాకెట్ల కోసం ఆర్డర్ చేయండి..  కింగ్ ఫిషర్ బీర్ పౌడర్ తో బీర్ తయారీకి సంబంధించి సంస్థ యూట్యూబ్ ఛానళ్లలో ఓ వీడియో వైరల్ అవుతోంది. బీర్ కావాలంటే.. ఈ వీడియో చూడాల్సిందే.. ఏప్రిల్ ఫూల్ కాదు.. నిజంగానే.. బీర్ ప్యాకెట్లు వచ్చేశాయట. 

ఏప్రిల్ 1 కదా.. ఫూల్స్ చేయడానికేనా? : 
ఏప్రిల్ ఒకటి వచ్చిందంటే చాలు.. ఆ కంపెనీ ఈ ఆఫర్ ఇస్తుంది.. ఈ కంపెనీ పలానా ఆ ఆఫర్ ఇస్తుందంటూ అందరిని ఫూల్స్ చేస్తూ ఎన్నో ప్రాంక్ న్యూస్ స్పెడ్ చేస్తుంటారు. ఏప్రిల్ ఫూల్ చేయడానికి ఇదో స్టంట్ అని కొట్టిపారేస్తుంటారు. ఏప్రిల్ 1వ తేదీకి ఒకరోజు ముందే సోషల్ మీడియాలో కింగ్ ఫిషర్ బీర్ మిక్స్ పౌడర్ వచ్చిందంటూ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తుంటే నిజంగానే అనిపిస్తున్నప్పటికీ.. కొందరు మాత్రం ఏప్రిల్ ఫూల్ చేయడానికేనంటూ కామెంట్ చేస్తున్నారు. 
 
కింగ్ ఫిషర్ కూడా బీర్ పౌడర్ శాంపిల్స్  కోసం రిజిస్టర్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కిక్ ఎక్కించే టేస్టీ  బీర్ ను రుచి చూడాలంటే.. వెంటనే బీర్ పౌడర్ శాంపిల్స్ కోసం kingfisherworld.com/instantbeer లో రిజిస్టర్ చేసుకోండి. 

Read Also : రియల్ గేమ్ ఫైట్ : రేసు మధ్యలో ఇద్దరు బైకర్లు కొట్టేసుకున్నారు