రేపే ఆఖరు రోజు : ఐటీ రిటర్న్ గడువు పెంచలేదు

  • Published By: chvmurthy ,Published On : August 30, 2019 / 10:32 AM IST
రేపే ఆఖరు రోజు : ఐటీ రిటర్న్ గడువు పెంచలేదు

2018-19 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేయటానికి గడువు శనివారం ఆగస్టు 31,2019 తో ముగుస్తుంది. ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేయటానికి ప్రభుత్వం మరోసారి గడువు పెంచిందని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని ఐటీ శాఖ అధికారులు తెలిపారు. ఇంతవరకు ఐటీ రిటర్న్ దాఖలు చేయనివారు రేపు శనివారం లోగా ఫైల్ చేయాలన్నారు. 

గడువు దాటిన తర్వాత 2019 డిసెంబర్ 31 లోపు రిటర్న్స్ ఫైల్ చేస్తే 5వేల రూపాయలు జరిమానా చెల్లించాలి. డిసెంబర్ 31 తర్వాత ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే 10వేలు జరిమానా చెల్లించాలి. టెక్నాలజీ పెరిగిపోవడంతో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం కూడా సులువైపోయింది. ప్రభుత్వ వెబ్‌సైట్ మాత్రమే కాక మరి కొన్ని  ప్రైవేట్ ఆర్ధిక సంస్ధల వెబ్ సైట్ల ద్వారా కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే అవకాశం ఉంది. పైసాబజార్‌, మై ఐటీ రిటర్న్, క్లియర్‌ ట్యాక్స్, ట్యాక్స్‌స్పానర్ వెబ్‌సైట్‌ల ద్వారా కూడా ఐటీఆర్‌లు దాఖలు చేయవచ్చు. ఇవే కాకుండా చాలా బ్యాంక్‌లు ఈ-ఫైలింగ్‌  సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్స్‌పై ఐటీఆర్, జీఎస్‌టీ రిటర్న్స్ ఇ-ఫైలింగ్ చేయొచ్చు. మరి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఉపయోగపడే వెబ్‌సైట్స్ గురించి ఒకసారి తెలుసుకోండి.
Also Read : కోనసీమలో విషాదం : డాక్టర్ కృష్ణంరాజు కుటుంబం సూసైడ్

1. Income Tax website: ఆదాయపు పన్ను శాఖకు చెందిన incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు.
2. Paisabazaar: పాలసీబజార్ గ్రూప్‌కు చెందిన సంస్థ పైసాబజార్ కూడా ఉచితంగా ఐటీఆర్ ఇ-ఫైలింగ్ సేవల్ని అందిస్తోంది. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది ఈ వెబ్‌సైట్. ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో నిపుణుల సలహాలు కూడా పొందొచ్చు.
3. myITreturn: 2006 సంవత్సరంలో ఆదాయపు పన్ను శాఖలో రిజిస్టరైన ఇ-రిటర్న్ ప్లాట్‌ఫామ్ ఇది. స్కోరీడోవ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. వేతనం, పెట్టుబడులు, లాభాలు, ఆదాయం లాంటి వివరాలతో ఐటీఆర్ ఇ-ఫైల్ చేయొచ్చు.
4. ClearTax: బెంగళూరుకు చెందిన ఫైనాన్షియల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ఇది. ఇందులో మీరు ఐటీఆర్, జీఎస్‌టీ రిటర్న్స్ ఇ-ఫైల్ చేయొచ్చు. ఈ వెబ్‌సైట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ సేవల్నీ అందిస్తుంది. 
5. TaxSpanner: ట్యాక్స్ స్పానర్ 2007 లో న్యూ ఢిల్లీ, బెంగళూరులో ప్రారంభమైన సంస్థ ఇది. ఇది కూడా ఆదాయపు పన్ను శాఖలో రిజిస్టైరైంది

Also Read : స్నేహితుడిని కాపాడి : ఎస్కలేటర్ పైనుంచి జారిపడి వృద్ధుడు మృతి