Volkswagen ఎమోషనల్ వీడియో: Beetle మోడల్‌కు వీడ్కోలు!

  • Published By: sreehari ,Published On : January 4, 2020 / 02:20 PM IST
Volkswagen ఎమోషనల్ వీడియో: Beetle మోడల్‌కు వీడ్కోలు!

దాదాపు ఏడు దశాబ్దాల ప్రొడక్షన్, మూడు దశబ్దాల డిజైన్ తర్వాత వోక్స్ వాగన్ తమ ఐకానిక్ ప్రొడక్టు అయిన బీటెల్ మోడల్ కాంపాక్ట్ కారు ప్రొడక్షన్‌కు గుడ్ బై చెప్పేస్తోంది. ఈ కొత్త ఏడాదిలో రిటైర్మెంట్ అవుతోంది. 2020 కొత్త ఏడాది సందర్భంగా కంపెనీ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.

రిటైర్మెంట్ ప్రకటన ముందే 2018లోనే బీటెల్ మోడల్ ఫైనల్ ఎడిషిన్ కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. బీటెల్ మోడల్ కారుకు వీడ్కోలు పలికే ఓ కొత్త యాడ్ క్యాంపెయిన్ వీడియోను ‘The Last Mile’ పేరుతో రిలీజ్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 90 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో బీటెల్ ఐకానిక్ మోడల్‌కు అభిమానులంతా వీడ్కోలు పలకడాన్ని చూడవచ్చు.

వోక్స్ వాగన్ 2050 నాటికి కార్బన్ న్యూట్రల్ మోడల్ కార్లను ప్రవేశపెట్టడమే లక్ష్యమని సందేశాన్ని ఈ వీడియో ద్వారా తెలియజేసింది. ఒక వ్యక్తి జీవితంలో బీటెల్ కారు రోల్ ఎలా ఉండేది.. కారుతోనే తరాలు మారిన విధానాన్ని ‘The Last Mile’ అనే యానిమేషన్ షార్ట్ వీడియో ద్వారా కంపెనీ అద్భుతంగా క్రియేట్ చేసింది. పాశ్చాత్య సంస్కృతిలో బీటెల్ మోడల్ కారు రోల్.. న్యూ ఇయర్ రోజు వరకు దాని ప్రయాణం ఎలా సాగింది వీడియోలో చూడవచ్చు.

డిజిటల్ బిల్ బోర్డ్స్ ద్వారా కంపెనీ Beetle మోడల్ టైమ్ స్క్వైర్ 70ఏళ్లు అవుతుందని వీడియోలో చూపించింది. వీడియోలో ప్రొ మ్యూజికా ద్వారా బీట్లెస్ ఫామస్ సాంగ్ ‘Let it Be యూత్ కోరస్‌తో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వినిపిస్తోంది. వైరల్ అయ్యే వీడియోను చూసిన పలువురు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.