గుడ్ న్యూస్ : పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు

ఆధార్ తో లింక్ చేసుకోని పాన్ కార్డు యూజర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వారికి రిలీఫ్ ఇచ్చింది. పాన్-ఆధార్ లింక్ గడువుని కేంద్రం పొడిగించింది. మరో 3 నెలలు

  • Published By: veegamteam ,Published On : September 28, 2019 / 03:48 PM IST
గుడ్ న్యూస్ : పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు

ఆధార్ తో లింక్ చేసుకోని పాన్ కార్డు యూజర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వారికి రిలీఫ్ ఇచ్చింది. పాన్-ఆధార్ లింక్ గడువుని కేంద్రం పొడిగించింది. మరో 3 నెలలు

ఆధార్ తో లింక్ చేసుకోని పాన్ కార్డు యూజర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వారికి రిలీఫ్ ఇచ్చింది. పాన్-ఆధార్ లింక్ గడువుని కేంద్రం పొడిగించింది. మరో 3 నెలలు(డిసెంబర్ 31,2019) సమయం ఇచ్చింది. సెప్టెంబర్ 30వ తేదీలోగా పాన్-ఆధార్ లింక్ చేసుకోవాలని కేంద్రం గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయినా చాలామంది ఈ ప్రక్రియ పూర్తి చేయలేదు. దీంతో తాజాగా ఆ గడువును పొడిగించింది. కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన ప్రత్యక్ష పన్నుల బోర్డు శనివారం(సెప్టెంబర్ 28,2019) ఈ మేరకు ప్రకటన చేసింది. కాగా, ఐటీఆర్ ఫైల్ చేసే వారు తమ పత్రాల్లో తెలిపే ఆధార్ సంఖ్య మేరకు కొత్త పాన్‌ నెంబర్ ని జారీ చేస్తామని ప్రభుత్వం ఇటీవల తెలిపింది. 

కేంద్రం పాన్‌ కార్డుకు ఆధార్‌ కార్డుతో లింక్ తప్పనిసరి చేసింది. ఆధార్ తో అనుసంధానం చేయకుంటే పాన్ కార్డు పని చేయదు. ఆర్థిక లావాదేవీలు చేసుకోలేరు. PAN-Aadhaar అనుసంధానం చేసుకోలేని వారి కోసం ప్రభుత్వం గడవు తేదీని పొడిగిస్తూ వస్తోంది. గతంలో ఎన్నోసార్లు గడువు తేదీని పెంచింది. ఈసారి.. సెప్టెంబర్ 30వ తేదీ డెడ్ లైన్ అని చెప్పింది. ఆ తర్వాత గడువు పెంచేది లేదు అని పదే పదే ప్రకటించింది. కానీ అనూహ్యంగా డెడ్ లైన్ ను పొడిగించింది. 

10 అంకెల గల (అల్ఫా న్యూమరిక్) పాన్ కార్డును ఆదాయ పన్ను (IT) శాఖ జారీ చేస్తుంది. అలాగే 12 అంకెల గల ఆధార్ కార్డును UIDAI జారీ చేస్తుంది. ఇప్పటివరకూ పాన్ కార్డును తమ ఆధార్ కార్డు లింక్ చేసుకోని వారు త్వరగా అనుసంధానం చేసుకోండి మరి. I-T వెబ్ సైట్ లేదా SMS ద్వారా ఈజీగా ఆధార్ -పాన్ కార్డు లింక్ చేసుకోవచ్చు. ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ వెబ్ సైట్ రికార్డుల ప్రకారం.. ఇప్పటివరకూ 8.47 కోట్ల వ్యక్తిగత పాన్ కార్డు దారుల్లో 6.77 కోట్ల మంది యూజర్లు తమ పాన్ కార్డులను ఆధార్ నెంబర్ తో లింక్ చేసుకున్నారు.

* ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేసుకునే యూజర్లు రెండెంటిపై తమ వివరాలు సరిపోలేలా చూసుకోండి. 
* పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మిస్ మ్యాచ్ కాకుండా చెక్ చేసుకోండి.
* సరైన వివరాలను ఎంటర్ చేయండి. రెండు కార్డుల్లో వివరాలు తప్పనిసరిగా మ్యాచ్ కావాలి. 
* ఏ కార్డులో వివరాలు మ్యాచ్ కాకపోయినా ఆధార్-పాన్ కార్డు లింక్ చేసుకోవడం కుదరదు.
* ఆధార్ కార్డులో పేరు తప్పుగా ఉంటే UIDAI వెబ్ సైట్ లో ఫిక్స్ చేసుకోండి. 
* పాన్ కార్డులో సమస్యల కోసం UTI-ITSL ద్వారా చెక్ చేసుకోవచ్చు.
* మీ ఆధార్ తో పాన్ లింక్ చేయకపోతే ఆర్థిక లావాదేవీలు చేసుకోలేరు.
* గడువు తేదీ దాటితే మీ పాన్ కార్డు చెల్లదు.