బాదుడు షురూ : వంట గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది

  • Published By: veegamteam ,Published On : September 1, 2019 / 02:54 PM IST
బాదుడు షురూ : వంట గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది

వంట గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. నాన్ సబ్సిడీ సిలిండర్ పై ఏకంగా రూ.15.5 పెంచారు. ఈ మేరకు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈ ధరలు కేవలం దేశ రాజధాని ఢిల్లీలో మాత్రమే వర్తిస్తాయి. ప్రస్తుతం నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ.574.5గా ఉంది. పెరిగిన ధరతో రూ.590కి చేరింది. పెరిగిన ధరలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధరలు ఇటీవలే తగ్గించారు. రూ.62 వరకు తగ్గించారు. అలా తగ్గించి నెల రోజులు గడవకముందే మళ్లీ రేట్లు పెంచారు. 

ప్రతి నెల 1వ తేదీన ఎల్పీజీ ధరలను రీటైల్ సంస్థలు సవరిస్తాయి. ఇందులో భాగంగా కొత్త రేట్లు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పడిపోయింది. ఇన్ పుట్ కాస్ట్ కూడా పెరిగింది. దీంతో గ్యాస్ ధరలు పెంచాల్సి వచ్చిందని చమురు కంపెనీలు తెలిపాయి. ఎల్పీజీతో పాటు విమాన ఇంధన ధరలను సైతం సవరించాయి. అంతర్జాతీయ చమురు ధరలు నిలకడగా ఉండడంతో జెట్ ఇంధన ధరను 1 శాతం తగ్గించినట్లు ఇంధన సంస్థలు తెలిపాయి. దీంతో విమాన ఇంధన ధర 4 నెలల కనిష్ఠానికి తగ్గినట్లయింది. ప్రస్తుతం ఢిల్లీలో ఒక కిలో విమాన ఇంధన ధర రూ.596.62 (0.9 శాతం) తగ్గి రూ.62,698గా ఉంది. లీటర్ కిరోసిన్ పై 25పైసలు పెంచారు.

Also Read : 5లక్షల విలువైన గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్టు